నిజం చెప్పిన 40 సెకన్లలో అమెరికా వీసా రిజెక్ట్.. నెట్టింట తీవ్ర చర్చ

by D.Reddy |
నిజం చెప్పిన 40 సెకన్లలో అమెరికా వీసా రిజెక్ట్.. నెట్టింట తీవ్ర చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: చాలా మంది భారతీయులకు అమెరికా వెళ్లాలనే డ్రీమ్ ఉంటుంది. కొంతమంది ఉన్నత చదువులకు వెళ్లాలనుకుంటే.. మరి కొంత మంది ఉద్యోగం కోసం.. ఇంకొంత మంది సరదాగా వెళ్లి అక్కడి టూరిస్టు ప్రదేశాలను చూసేందుకు వెళ్లాలనుకుంటారు. అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కఠిన వలస విధాలను అమలుచేస్తోన్నారు. దీంతో అమెరికా వీసా పొందటం చాలా కష్టంగా మారింది. చివరికి పది రోజుల పర్యటనకు వెళ్లాలన్న వీసా అనుమతి దొరకటం లేదు. తాజాగా ఓ భారతీయ యువకుడికి ఎదురైన పరిస్థితిని ఆ యువకుడి సోషల్ మీడియాలో పంచుకోగా.. తీవ్ర చర్చకు దారితీసింది.

ఓ భారతీయ యువకుడు పది రోజుల పర్యటనకు అమెరికా వెళ్లాలనుకుని B1/B2 వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. న్యూఢిల్లీలోని యూఎస్ ఎంబసీకి (US Embassy) ఇంటర్వ్యూకు వెళ్లాడు. అక్కడ వారు మూడు ప్రశ్నలు అడిగారు. అమెరికాకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? భారత్ వెలుపల ఎప్పుడైనా పర్యటించారా? అమెరికాలో మీకు ఎవరైనా బంధువులు ఉన్నారా? అని అడుగగా.. ఆ యువకుడు సమాధానాలు ఇచ్చాడు. రెండు వారాల వెకేషన్ ట్రిప్ కోసం ఫ్లోరిడా వెళ్లాలనుకుంటున్నానని, ఇప్పటి వరకు భారత్ దాటి ఎక్కడికీ వెళ్లలేదని, ఫ్లోరిడాలో తన గర్ల్‌ఫ్రెండ్ ఉందని చెప్పాడు. అయితే, అతడు బదులిచ్చిన 40 సెకన్లలోనే అతడి వీసాను రిజెక్ట్ చేసినట్లు సోషల్ మీడియా పోస్టులో చెప్పాడు. తాను నిజాయితీగా సమాధానాలిచ్చిన ఎందుకు తన వీసా రిజెక్ట్ చేశారో తెలియటం లేదని వాపోయాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 'గర్ల్‌ఫ్రెండ్‌ గురించి ప్రస్తావించడమే మీరు చేసిన తప్పు. ఆమె సాయంతో అమెరికాలో అక్రమంగా ఉండిపోతారేమోనని వారు భయపడుతున్నారు' అని పలువురు నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed