జెప్టో పార్సిల్‌లో నమ్మలేని దృశ్యం.. విరుచుకుపడుతున్న నెటిజన్లు!

by Yella Dhawani Reddy |

ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్లో ఈ-కామర్స్, క్విక్‌ కామర్స్‌ సంస్థల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.

జెప్టో పార్సిల్‌లో నమ్మలేని దృశ్యం.. విరుచుకుపడుతున్న నెటిజన్లు!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఈ-కామర్స్, క్విక్ కామర్స్ (E-commerce, Quick Commerce) సేవల వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. కొన్ని నిమిషాల్లో నిత్యవసర సరుకులు ఇంటి గుమ్మం వరకూ చేరడం ప్రజలకు ఒక గొప్ప సౌలభ్యంగా మారింది. ముఖ్యంగా జెప్టో (Zepto), బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ వంటి సంస్థలు ఆధునిక జీవితంలో అవసరమైన భాగంగా మారిపోయాయి. వివిధ అవసరాల కోసం వినియోగదారులు ఈ సేవలను ఎక్కువగా ఆశ్రయిస్తుండగా, ఇటీవలి కాలంలో మాత్రం ఈ సంస్థలపై నాణ్యతపరమైన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేకించి, పాడైన కూరగాయలు, పండ్లు, నల్లబడిన అండాలు, తప్పుగా పంపిన వస్తువులు, ఆలస్యం అయ్యే డెలివరీలు వినియోగదారులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి. ఇటీవల డిజిటల్ కంటెంట్ క్రియేటర్ అయుషి ప్రసాద్ జెప్టో ద్వారా ఆర్డర్ చేసిన కొన్ని వస్తువులపై చేసిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్‌గా మారింది.

అయూషి జెప్టో నుంచి పుచ్చకాయ, ఎగ్స్, తదితర వస్తువులు ఆర్డర్ చేశారు. అయితే, ఆమెకు పూర్తిగా పాడై కుళ్లిన పుచ్చకాయ, ఎగ్స్ డెలివరీ అవ్వటం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే వాటి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'రిఫండ్ సరిపోదు బ్రో, నాణ్యతపై దృష్టిపెట్టు' అంటూ ఆమె ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కూడా తాము ఎదుర్కొన్న అనుభవాలను కామెంట్ల ద్వారా పంచుకున్నారు. 'నేను ఇదే విషయం మునుపే గుర్తించాను. ప్యాక్డ్ వస్తువులు ఆర్డర్ చేస్తే Cash on Delivery వాడండి, ఎక్స్‌పైరీ డేట్ తప్పకుండా చెక్ చేయండి. పండ్లు, కూరగాయలు ఏ క్విక్ కామర్స్ నుంచి కూడా ఆర్డర్ చేయకండి. డిస్కౌంట్ వస్తే అసలు సరుకు ఎప్పుడు తయారయిందో, ఎప్పటికీ వాడాలో చూసుకోవాలి' అని సూచించాడు. జెప్టో కూడా ఈ ఘటనను గమనించి స్పందించింది. 'మీ ఆందోళన మేము అర్థం చేసుకుంటున్నాం. దయచేసి మీ ఆర్డర్ వివరాలను డైరెక్ట్ మెసేజ్ చేయండి. మేము వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాము' అని వారు కామెంట్‌లో రాసారు.

Next Story