ట్రెండింగ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ boycottindependenceDay

by Muthe.Rajitha |

దేశంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

ట్రెండింగ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ boycottindependenceDay
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అయితే ఓ వైపు స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు జరుగుతుండగా.. మరోవైపు బాయ్ కాట్ ఇండిపెండెన్స్ డే అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. దేశంలో మగవాళ్లకు రక్షణ లేకుండా పోతోందని పురుషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు స్వాతంత్య్రం లేదని ప్రముఖ సోషల్ మీడియా X వేదికగా #BoycottIndependenceDay అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టాలు అన్నీ ఆడవాళ్ళ కోసమేనని, మగవాళ్ళను కాపాడానికి ఎలాంటి చట్టాలు లేవని.. ఇప్పుడు ఉన్నవాటిని మార్చాల్సిన సమయం వచ్చిందని వాపోతున్నారు. దేశంలో మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాలు మార్చాలని డిమాండ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. భార్య మోసం చేసినా, లేదా ఆమెకు విడాకులు కావాల్సి వచ్చినా తామెందుకు భరణం పేరుతో పరిహారం చెల్లించుకోవాలని మండిపడుతున్నారు. ఇటీవల భర్తలను చంపుతున్న ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళను ఎవరూ రక్షించడం లేదని ఫైర్ అవుతున్నారు.

Next Story