- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kaveri Engine: ట్రెండింగ్‌లో #FundKaveriEngine హ్యాష్ ట్యాగ్.. కావేరి ఇంజిన్ అంటే ఏమిటో తెలుసా?
పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు చైనా నుండి పెరుగుతున్న ముప్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశీయంగా మరిన్ని యుద్ధ యంత్రాలను క్రియేట్ చేయాలనే ఆలోచనలో ఉంది.

దిశ, డైనమిక్ బ్యూరో: పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు చైనా నుండి పెరుగుతున్న ముప్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశీయంగా మరిన్ని యుద్ధ యంత్రాలను క్రియేట్ చేయాలనే ఆలోచనలో ఉంది. బడ్జెట్‌లో సైతం ఢిఫెన్స్ రంగానికి భారీగా నిధులు కేటాయించింది. ఈ నేపథ్యంలోనే నెటిజన్‌లు కేంద్ర ప్రభుత్వానికి కీలక రిక్వెస్ట్ చేశారు. నేటికీ మనము (Fighter jet engine) ఫైటర్ జెట్ ఇంజిన్‌ల కోసం అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలపై ఆధారపడుతున్నామని, అవి భద్రత, సాంకేతికంగా కూడా ప్రమాదమని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. (kaveri engine) కావేరి ఇంజిన్ ప్రాజెక్ట్ అనేది స్వదేశీ ఫైటర్ జెట్ ఇంజిన్‌ను నిర్మించాలనే భారత్ కల అని, కానీ ఆ కల ఏళ్లుగా నిలిచిపోయింది.. ఇతర దేశాలపై ఆధారపడకుండా కావేరీ ఇంజిన్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రానికి నెటిజన్లు రిక్వెస్ట్ చేశారు. అలాగే #FundKaveriEngine హ్యాష్ ట్యాగ్‌ను ఉపయోగించి ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు. కావేరీ ఇంజిన్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రాజెక్టు వేగవంతం చేయాలని పోస్టుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. కావేరీ ఇంజిన్ మోడల్ సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కావేరి ఇంజిన్ ప్రాజెక్టు ఏమిటి?
అసలు కావేరి ఇంజిన్ ప్రాజెక్టు అంటే ఏమిటో తెలుసుకుందాం. కావేరీ ఇంజిన్ అనేది స్వదేశీ జెట్ ఇంజిన్. ఇది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలో భారత్ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ (జీటీఆర్ఈ) అభివృద్ధి చేసింది. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్ యుద్దవిమానానికి వాడేందుకు రూపొందించారు. తక్కువ-బైపాస్, ట్విన్-స్పూల్ టర్బోఫ్యాన్ ఇంజిన్, ఇది 80 kn థ్రస్ట్‌ను ఈ ఇంజిన్ కలిగి ఉంటుంది. 1980లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పలు కారణాల వల్ల తీవ్ర అంతరాయం ఏర్పడింది. 2008లో దీన్ని తేజస్ ప్రోగ్రామ్ నుంచి వేరు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.






