డ్రైవింగ్ చేయలేం బాబూ..ఆ లిస్ట్ లో ఇండియానే మొదటి స్థానం !

by velandi.Saikiran |

ప్రతి దేశంలో రవాణా మార్గం చాలా ముఖ్యం. అయితే మన ఇండియాలో ( India) రవాణా వ్యవస్థ ( Transportation system) చాలా

డ్రైవింగ్ చేయలేం బాబూ..ఆ లిస్ట్ లో ఇండియానే మొదటి స్థానం !
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి దేశంలో రవాణా మార్గం చాలా ముఖ్యం. అయితే మన ఇండియాలో ( India) రవాణా వ్యవస్థ ( Transportation system) చాలా అద్భుతంగా ఉంది. కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించే వాళ్ళు మాత్రం లేరని చెబుతున్నాయి నివేదికలు. తాజాగా.. ఓ సంస్థ ప్రకటించిన నివేదిక ప్రకారం.. వాహనాలు నడపడానికి ఏమాత్రం.... సేఫ్టీ గా లేని, దేశాల్లో ఇండియానే నెంబర్ వన్ స్థానంలో ఉంది.

ఇండియాలో ట్రాఫిక్ రూల్స్ ( Traffic Rules) ఎవరు పాటించబోరని... ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేస్తారని ఈ నివేదిక ప్రకటించింది. దీనివల్ల ప్రమాదకరమైన యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం సూచించిన రూల్స్ ప్రకారం ఎవరు నడుచుకోరని కూడా ఈ నివేదిక స్పష్టం చేసింది.

ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతో... దేశం వ్యాప్తంగా ఎక్కడ చూసిన ట్రాఫిక్ సమస్య ఉంటుందని తెలిపింది. అందుకే డ్రైవ్ చేయడానికి సేఫ్టీ ప్లేస్ కానీ అలాగే చెత్త దేశంగా ఇండియా మొదటి స్థానంలో నిలిచింది. ఇండియా తర్వాత వెనిజులా, జింబాబ్వే, మొరాకో, థాయిలాండ్ ఉన్నాయి. ఆ తర్వాత చైనా, టునిసియా , బ్రెజిల్, కొలంబియా, మలేషియా దేశాలు ఆ తర్వాత లిస్టులో ఉన్నాయి.

Next Story