- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video : డాక్టర్ చేసిన పనికి ఛీ.. ఛీ.. అనాల్సిందే!
వైద్యుడు(Doctor) భగవంతునితో సమానం అంటారు పెద్దలు.

దిశ, వెబ్ డెస్క్ : వైద్యుడు(Doctor) భగవంతునితో సమానం అంటారు పెద్దలు. పోయే ప్రాణాలను రక్షించే దేవుడని అంటారు. ఏ వృత్తిలో ఉన్నవాళ్లకు నమస్కారం చేయకపోయినా వైద్యులకు మాత్రం చేతులెత్తి దండం పెడతారు. కాని యూపీ(UP)లోని ఓ వైద్యుడు చేసిన పనికి ఛీ.. ఛీ.. మానవత్వం లేని మనిషివి నువ్వని అంతా దుమ్మెత్తి పోస్తున్నారు. ఎమర్జెన్సీ పరిస్థితిలో ఆసుపత్రికి వచ్చిన ఓ పేషెంట్ వైపు డాక్టర్ కన్నెత్తి కూడా చూడకుండా రీల్స్ చూడటంలో నిమగ్నం కావడం వలన, సకాలంలో వైద్యం అందక ఆ పేషెంట్ మృతి చెందింది. ఇదేమిటని నిలదీసిన పేషెంట్ కుమారుడిపై చేయిచేసుకోగా.. ఆగ్రహించిన బంధువులు డాక్టర్ పై దాడి చేశారు. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ వైద్యున్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..యూపీలో మెయిన్‌పురి(Mainpuri) జిల్లాలో 60 ఏళ్ల ప్రవేశ్ కుమారికి గుండెపోటు రాగా.. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను మహారాజా తేజ్ సింగ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఆ మహిళను తీసుకువచ్చారు. కాగా, ఎమర్జెన్సీ వార్డులో డ్యూటీలో ఉన్న డాక్టర్ ఆదర్శ్ సెంగర్ తన మొబైల్ ఫోన్‌లో రీల్స్ చూడటంలో బిజీగా ఉండి, పేషెంట్ ను పట్టించుకోలేదు. నొప్పితో విలవిలాడుతున్న ఆమె పరిస్థితిని డాక్టర్ కు వివరించినా, బతిమాలినా అతడు పట్టించుకోలేదు.
దీంతో వైద్యం అందక కాసేపటికే ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీనిపై ఆ మహిళ కుమారుడు డాక్టర్ ను ప్రశ్నించగా.. అతడి చెంప చెల్లుమనిపించాడు. దీంతో ఆగ్రహించిన మహిళ బంధువులు అంతా కలిసి ఆ డాక్టర్ పై దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, పరిస్థితిని సమీక్షించారు. విషయం తెలుసుకున్న ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ అక్కడికి చేరుకొని.. డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మృతి చెందిన మహిళ కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సాక్ష్యాల కోసం ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశిలీంచగ అసలు విషయం బయట పడటంతో డాక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మానవత్వం లేని మనిషి ఆ డాక్టర్ అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు.






