Viral video: మదర్ ఆఫ్ ది ఇయర్.. బిడ్డలు పొద్దున్నే నిద్ర లేవడం లేదని తల్లి తీసుకున్న వినూత్న నిర్ణయం

by Ramesh Naini |   (  Updated:2025-10-25 12:42:08  IST  )

నిద్రపోతున్న పిల్లలను తల్లి లేపడానికి చేసే నానా ప్రయత్నాలు తమ జీవితాల్లో అందరూ ఒకసారి ఫేస్ చేసి ఉంటారు.

Viral video: మదర్ ఆఫ్ ది ఇయర్.. బిడ్డలు పొద్దున్నే నిద్ర లేవడం లేదని తల్లి తీసుకున్న వినూత్న నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉదయం లేట్‌గా నిద్ర లేవడం కొంత మందికి బాగా అలావాటు. అలాంటి సమయంలో నిద్రపోతున్న పిల్లలను తల్లి లేపడానికి చేసే నానా ప్రయత్నాలు తమ జీవితాల్లో అందరూ ఒకసారి ఫేస్ చేసి ఉంటారు. పిల్లలపై తిట్టడం, నీళ్లు పోయడం లేదా ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయడం, గిన్నెల సౌండ్స్ చేయడం వంటివి అమ్మలు చేస్తుంటారు. అయితే, ఉదయం ఆలస్యంగా నిద్ర పోతున్న పిల్లలను లేపేందుకు ఒక తల్లి తీసుకున్న వినూత్న నిర్ణయం తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో ప్రకారం.. బిడ్డలు ఎన్నిసార్లు పిలిచినా లేవకపోవడంతో, ఓ తల్లి ఇంటి ముందు నుంచి పోతున్న బ్యాండ్‌(band)ని ఇంట్లోకి పిలిపించి మ్యూజిక్ కొట్టించింది. బెడ్ రూమ్‌లో గాఢనిద్రలో ఉన్న బిడ్డల ముందు బ్యాండ్‌ వారు చెవులకు చిల్లులు పడేలా బ్యాండ్ మోగించారు. దీంతో దెబ్బకు పిల్లలు లేచి కూర్చుని తల్లి ముఖం వైపు నవ్వుతూ చూడసాగారు. ఆ దృశ్యాన్ని తల్లి స్వయంగా వీడియో తీసింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. తల్లి చేసిన ఈ సరికొత్త ప్రయత్నం ఇప్పుడు నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది. మదర్ ఆఫ్ ద ఇయర్, క్రియేటివ్‌గా ఆలోచించిన తల్లికి అవార్డు ఇవ్వాలి.. అని నెటిజన్‌లు కామెంట్ చేశారు. తల్లి చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ ఘటన బెంగళూరులో జరిగినట్లుగా తెలుస్తోంది.

వైరల్ వీడియో ఇదే..

Next Story