క్యూట్‌నెస్ ట్యాక్స్ వసూలు చేసిన చిన్న ఏనుగు.. వైరల్ వీడియో

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-26 12:18:36  IST  )

సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు కొదవలేదు. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక సంఘటనలకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి.

క్యూట్‌నెస్ ట్యాక్స్ వసూలు చేసిన చిన్న ఏనుగు.. వైరల్ వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో (Social Media) వైరల్ వీడియోలకు కొదవలేదు. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక సంఘటనలకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ (Viral) అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లు విశేషంగా ఆకట్టుకుంటాయి. తాజాగా నెట్టింట ఓ క్యూట్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ చిన్న ఏనుగు పిల్ల (Elephant) తన అమాయకత్వంతో, చిన్నతనంతో, సహజమైన ప్రవర్తనతో నెటిజన్లను మురిపిస్తోంది.

ఈ వీడియోలో ఒక ఏనుగుల గుంపు రోడ్డుపై వెళ్తుంది. వాటిపై కాపలాదారులు కూర్చున్నారు. మధ్యలో నడుస్తున్న చిన్న ఏనుగు పిల్ల ఒక్కసారిగా ఆగిపోయి, రోడ్డుపక్కనున్న కూరగాయల బండి దగ్గరకు వెళ్లింది. అందులోంచి ఒక కూరగాయను ఇవ్వమన్నట్లుగా ఆ కూరగాయల బండి వ్యాపారి వైపు తొండాన్ని చూపింది. అది చూసిన ఆ వీధి వ్యాపారి, అక్కడ ఉన్న మహిళా ఒక్కసారిగా అబ్బురపోయారు. వెంటనే ఆ పిల్ల ఏనుగుకి ప్రేమతో ఒక కూరగాయను అందించారు. అది తీసుకుని ముద్దుగా తిన్న చిన్న ఏనుగు వెంటనే తన కుటుంబానికి చేరేందుకు మళ్లీ ముందుకు నడిచింది. ఈ క్యూట్ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి (రిటైర్డ్) సుశాంత నందా 'చిన్న స్నాక్ బ్రేక్.. క్యూట్' అనే క్యాప్షన్‌తో ఎక్స్ వేదికగా షేర్ చేశారు. నెటిజన్లు ఈ వీడియోను విపరీతంగా లైక్ చేస్తూ.. 'చిన్న ఏనుగుకు క్యూట్‌నెస్ ట్యాక్స్' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story