ప్రీమియం కాఫీ మెషిన్ ఇచ్చిన కంపెనీ.. కానీ ఉద్యోగులు చేసిన పనికి షాక్ అవుతారు!

by Yella Dhawani Reddy |

ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గించేందుకు ఐటీ కంపెనీలు కార్యాలయాల్లో వివిధ రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాయి.

ప్రీమియం కాఫీ మెషిన్ ఇచ్చిన కంపెనీ.. కానీ ఉద్యోగులు చేసిన పనికి షాక్ అవుతారు!
X

దిశ, వెబ్ డెస్క్: ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గించేందుకు ఐటీ కంపెనీలు (IT companies) కార్యాలయాల్లో వివిధ రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్రీ లంచ్, స్నాక్స్, గేమింగ్ జోన్‌లు, రిలాక్సేషన్ కార్నర్‌లు.. ఇవన్నీ ఇప్పుడు చాలా కంపెనీల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. అయితే, వాటిల్లో కాఫీ మెషీన్‌కి (Coffee machine) ప్రత్యేక స్థానం ఉంది. పని నడుమ ఓ కప్పు వేడి కాఫీ ఉద్యోగులకి రిలీఫ్, ఎనర్జీ డోస్ ఇచ్చేదే కాదు, వాళ్ల మధ్య సంభాషణలకు వేదిక కూడా అవుతుంది. ప్రతి ఐటీ కంపెనీలో కాఫీ బ్రేక్ అనేది ఒక కామన్ కల్చర్‌గా మారిపోయింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ సంఘటన ఈ కాఫీ కల్చర్‌కి భిన్నమైన కోణాన్ని చూపించింది. ఉద్యోగుల కోసం కంపెనీలు మంచి చేస్తే, అది నిజంగా వారికి ఉపయోగపడుతుందా? లేక దుర్వినియోగమవుతుందా? అన్న ప్రశ్నలకు తెరతీసింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఓ భారతీయ ఐటీ ఉద్యోగి రెడ్డిట్ వేదికగా తమ ఆఫీసులో జరిగిన ఓ సంఘటనను షేర్ చేశారు. వారి కంపెనీలో మొదటగా రుచి లేని ఇన్‌స్టంట్ కాఫీ అందించేవారని తెలిపారు. దానిపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేయటాన్ని గమనించిన యజమాన్యం.. ఏప్రిల్ 2025లో నెస్ట్లే (Nestle)తో భాగస్వాయం చేసుకుని ప్రీమియం కాఫీ మెషీన్‌ను ఏర్పాటు చేసింది. అందులో ఎస్ప్రెస్సో, కోల్డ్ కాఫీ, టమోటా సూప్, హాట్ చాకొలేట్ వంటి పలు రకాల డ్రింక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఉద్యోగులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కానీ. ఆ ఆనందం కొద్దికాలానికే భయంకరమైన సమస్యగా మారింది.

ఉద్యోగులు ప్యాంట్రీ వద్ద గుంపులు గుంపులుగా నిలబడి, ఒకదాని తర్వాత ఒక డ్రింక్ తాగడం మొదలుపెట్టారు. కొందరు మిగతా ఉద్యోగులకు అవకాశం ఇవ్వకుండా స్వార్థంగా వ్యవహరించడంతో గొడవలు, వాగ్వాదాలు జరిగాయి. రోజులో ఒక్కసారి రీఫిల్ చేయాల్సిన ప్రీమిక్స్‌లు, రోజుకు మూడు సార్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్రేక్‌ల అధికంగా తీసుకుంటుండటంతో మీటింగ్‌లు ఆలస్యమయ్యాయి. మేనేజర్లు అసహనం వ్యక్తం చేయడం ప్రారంభించారు. ఈ కాఫీ మెషీన్ వినియోగం విపరీతంగా ఉండటంతో 6 నెలల పాటు సరిపడే ప్రీమిక్స్ స్టాక్, కేవలం రెండు నెలల్లోనే ఖాళీ అయిపోయింది.

దీంతో మేనేజ్‌మెంట్ తిరిగి పాత ఇన్‌స్టంట్ కాఫీనే ఏర్పాటు చేసింది. ఈ పరిణామాన్ని వివరించిన ఉద్యోగి చివరగా.. 'మనం నిజంగా మంచి విషయాలకు అర్హులం కాదు, అందుకే మళ్లీ పాత రుచిలేని కాఫీనే తాగాల్సిన పరిస్థితి వచ్చింది' అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కొందరు తమ కంపెనీల ప్యాంట్రీ కల్చర్ (pantry culture) గురించి ఆసక్తిగా చెబుతుంటే, మరికొందరు ఈ వినియోగాన్ని నియంత్రించడంలో మేనేజ్‌మెంట్ విఫలమైందని అన్నారు. మొత్తంగా ఈ సంఘటన ఉద్యోగుల అవసరాలను తీర్చాలనే మంచి ఉద్దేశం, క్రమశిక్షణ లేకపోతే ఎలా విఫలమవుతుందో స్పష్టంగా చూపిస్తుంది.

There's a reason why Indian Corporate Places do bare minimum for their employees and we don't deserve good things byu/Roastingisflattery inIndianWorkplace

Next Story