అక్కడ థియేటర్‌లోని బాత్రూమ్స్ చాలా స్పెషల్ గురూ.. అసలు విషయం తెలిస్తే వావ్ అనాల్సిందే..

by Gugulothu.Kavitha |

సాధారణంగా మనం ఏదైనా సినిమా చూడటానికి థియేటర్‌కి వెళ్లినప్పుడు కొన్ని కొన్ని సార్లు మంచి యాక్షన్ సీన్స్ లేదా బాగా ఇంట్రెస్టింగ్ సీన్స్ వస్తున్నప్పుడే మనకు మధ్యలో టాయిలెట్ వస్తుంది.

అక్కడ థియేటర్‌లోని బాత్రూమ్స్ చాలా స్పెషల్ గురూ.. అసలు విషయం తెలిస్తే వావ్ అనాల్సిందే..
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా మనం ఏదైనా సినిమా చూడటానికి థియేటర్‌కి వెళ్లినప్పుడు కొన్ని కొన్ని సార్లు మంచి యాక్షన్ సీన్స్ లేదా బాగా ఇంట్రెస్టింగ్ సీన్స్ వస్తున్నప్పుడే మనకు మధ్యలో టాయిలెట్ వస్తుంది. ఎంత ఆపుకోవాలని ట్రై చేసిన కొన్ని సార్లు ఆపుకోలేము. దీంతో బాత్రూమ్‌కి పరుగులు పెడతాము. దీంతో ఆ మంచి సీన్స్ మనం మిస్ అవుతాము. కానీ ఈ థియేటర్‌లో ఆ బాధ లేదు. గంటల తరబడి వాష్ రూమ్‌లో ఉన్న ప్రశాంతంగా సినిమా చూసేయవచ్చు. ఏంటి వినడానికి షాకింగ్‌గా అనిపిస్తుందా. అయితే ఇప్పుడు ఈ ఫెసిలిటీ ఉన్నది మనం దేశంలో అనుకుంటే పొరపాటు పడినట్టే ఎందుకంటే ఈ ఫెసిలిటీ ఉన్నది స్విస్ దేశంలో. వివరాల్లోకి వెళితే..

సినిమా మధ్యలో బాత్రూమ్‌కి వెళ్లడం వల్ల సినిమా సీన్స్ మిస్ అవుతున్నాము అనే సినీ ప్రేక్షకులకు స్విట్జర్లాండ్ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే మీరు వాష్ రూమ్‌కి వెళ్లిన ఒక్క నిమిషం కూడా సినిమా మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్విస్ మేధావులు.. వినూత్నంగా బాత్రూమ్ స్టాల్‌లోని టైల్స్‌కు సినిమా స్క్రీన్‌లను అమర్చారు. దీంతో మీరు గంటల తరబటి వాష్ రూమ్‌లో ఉన్నా అక్కడే కూర్చుని సినిమా చూసేయొచ్చు. దీంతో మీరు మూవీలోని సింగిల్ సెకెండ్ కూడా మిస్ కాలేరు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. తెలుగు ప్రేక్షకులు కూడా మాకు ఇలాంటి ఫెసిలిటీ తీసుకురావాలని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story