ఒంటిమీద నూలు పోగు లేకుండా ఆ పాఠాలు చెప్తున్న టీచర్.. నగ్నంగా అలా చేయడంపై నెటిజన్ల రియాక్షన్ ఇదే !

by Javid Pasha |

ఒంటిమీద నూలు పోగు లేకుండా ఆ పాఠాలు చెప్తున్న టీచర్.. నగ్నంగా అలా చేయడంపై నెటిజన్ల రియాక్షన్ ఇదే !

ఒంటిమీద నూలు పోగు లేకుండా ఆ పాఠాలు చెప్తున్న టీచర్.. నగ్నంగా అలా చేయడంపై నెటిజన్ల రియాక్షన్ ఇదే !
X

దిశ, ఫీచర్స్ : వినడానికి వింతగా అనిపించచ్చు కానీ ఇది నిజంగానే జరిగింది. ఒక టీచర్ నగ్నంగా మారి తరగతి గదిలో స్టూడెంట్స్‌కు ఆ పాఠాలు చెప్పింది. బాడీనిలో ఒక్కో పార్ట్‌ను ప్రదర్శిస్తూ వాటి గురించి వివరించింది. అంతేకాదు ఈ విషయాలపట్ల అవగాహన పెంచుకోవడం వల్ల మంచి భవిష్యత్తు ఉంటుందని బోధించింది. ప్రస్తుతం ఆమె చెప్పిన లెసన్స్‌కు సంబంధించిన వివరాలతో కూడిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. కొందరైతే మీ బోధనా విధానం బాగుందంటూ ఇలా అందరికీ బోధిచాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

వైరల్ సమాచారం ప్రకారం.. ఆమె పేరు వెరోనికా డుక్వే, వయసు 43 ఏండ్లు, స్పెయిన్‌లోని వల్లాడోలిడ్‌కు చెందిన ఈ ఉపాధ్యాయురాలు వృత్తిలో భాగంగా ఏడెనిమిదేండ్ల వయసుగల తన మూడవ తరగతి విద్యార్థులకు మానవ శరీర నిర్మాణ శాస్త్రాన్ని (Human anatomy) చక్కగా అర్థమయ్యేలా, సృజనాత్మకంగా చెప్పాలని నిర్ణయించుకున్నది. అయితే స్టూడెంట్స్‌కు బాడీ పార్ట్స్ ఎలా ఉంటాయో ఊహించడం కష్టమని గుర్తించిన ఆమె, అందుకోసం అలీఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్‌లో చూసి మానవ శరీరంలోని అవయవాల స్థానాల(Positions of organs)ను స్పష్టంగా చూపించే స్కిన్-టైట్ బాడీసూట్‌ను కొనుగోలు చేసింది. దానిని ధరించిన ఆమె ఊపరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు ఇలా ప్రతీ అవయవం, దాని పనితీరు గురించి వివరిస్తూ క్లాస్ చెప్పింది. ఈ సూట్‌ బాడీ పార్ట్స్‌ను ప్రదర్శించే నగ్న వ్యక్తి శరీరాన్ని పోలి ఉండటంవల్ల స్టూడెంట్స్‌కు ఈజీగా అర్థమైందని ఆమె పేర్కొనగా, ఒక వ్యక్తి దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు మీ బోధనా తీరు బాగుందంటూ ఆ టీచర్‌ను తెగ పొగిడేస్తున్నారు.

Source: Instagram link

Next Story