మ‌ర్యాద రామ‌న్న సీన్ రిపీట్..అచ్చు దించేశాడు

by velandi.Saikiran |

మ‌ర్యాద రామ‌న్న సీన్ రిపీట్ చేశాడు ఓ వ్య‌క్తి. ట్రైన్ కిటికీలో ఇరుకున్న కొబ్బ‌రి బోండాను తెలివిగా సంపాదించాడు.

మ‌ర్యాద రామ‌న్న సీన్ రిపీట్..అచ్చు దించేశాడు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కెరీర్ ప్రారంభంలో కామెడీ చేస్తూ అందరిని మెప్పించిన సునీల్, ఆ తర్వాత హీరోగా ఎదిగారు. సునీల్ హీరోగా చాలా సినిమాలే వచ్చాయి. అందులో ఒకటి మర్యాద రామన్న. ఈ సినిమా సునీల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సునీల్ హీరోగా చేయగా సలోని హీరోయిన్ గా మెరుసారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ మూవీలో ట్రైన్ సీన్ అందరికి నవ్వు తెప్పిస్తుంది. కొబ్బరి బోండాను కిటికీ బ‌య‌టి నుంచి ఎలా దక్కించుకుంటాడని దానిపైన ఈ సీన్ ఉంటుంది.

థియేటర్ లో ఈ సీన్ రాగానే అందరూ నవ్వుకుంటారు. అయితే అచ్చం అలాంటి సంఘటనే నిజ జీవితంలో ఒకటి జరిగింది. ఓ వ్యక్తి తన ఫ్యామిలీతో ట్రైన్ లో జర్నీ చేస్తున్నాడు. సునీల్ తరహాలోనే ఓ కొబ్బరి బోండా తీసుకొని, ఇరుక్కున్నాడు సదర్ ప్రయాణికుడు. ఫోటోలో చూపించినట్లుగా కిటికీ అవతల కొబ్బరి బోండా ఉండగా, దానిని దక్కించుకునేందుకు సదరు ప్రయాణికుడు విశ్వప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే కిటికీకి ఉన్న ఇనుప కడ్డీలను వంచి మరీ, ఆ కొబ్బరి బోండాను సాధిస్తాడు. ఆ తర్వాత ఆయన భార్యకు ఇవ్వడంతో ఆమె సంతోషపడుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇది చూసిన జనాలందరూ... మర్యాద రామన్న సినిమాను గుర్తు చేసుకుంటున్నారు.

Next Story