- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిహార్‌లో గుర్తుతెలియని జంతువు కలకలం.. కుక్కలాంటి ముంగీస..?! (వీడియో)
ప్రజలు అక్కడ గుమిగూడారని హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. It looks like Dog or Mongoose?!

దిశ, వెబ్‌డెస్క్ః భూమిపైన ఎన్నో ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని ఇదివరకెన్నడూ చూడనివైతే మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాంటి ఓ సంఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ ప్రాంతం నుండి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసే వీడియో ఒకటి బయటకొచ్చింది. అక్కడ ఓ భవనంలోకి జొరబడిన వింత జంతువు కెమెరాకు చిక్కింది. ఈ వీడియోలో, జంతువు ఒక పాడుబడిన గదిలో తిరుగుతూ, తప్పించుకోడానికి ప్రయత్నిస్తోంది. ముంగిస వంటి వేగం, కుక్క వంటి శరీరం ఉన్న ఈ జంతువు గోడకున్న రాక్‌పైకి ఎక్కుతుంది. కొందరు దీనిని కుక్క అని పిలిస్తే, మరికొందరు ముంగిసగా భావిస్తున్నారు. మరికొందరు ఏదో తెలియక అయోమయంలో పడ్డారు. ఈ వింత జంతువును చూడటానికి చాలా మంది ప్రజలు అక్కడ గుమిగూడారని హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. తర్వాత, అటవీశాఖ సిబ్బంది దీన్ని బంధించినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఈ జంతువు ఏమైయుంటుంది?!






