కన్న కూతురును చూడకుండానే కన్నుమూసిన జవాన్

by Muthe.Rajitha |

మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక హృదయ విదారక ఘటన జరిగింది.

కన్న కూతురును చూడకుండానే కన్నుమూసిన జవాన్
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక హృదయ విదారక ఘటన జరిగింది. ఆర్మీ జవాన్ మరణించిన కొద్ది గంటల్లోనే అతని కూతురు ఊపిరి పోసుకొని భూమి మీదకు వచ్చింది. కన్నతండ్రిని కడసారి చూపుకు కూడా ఆ చిన్నారి నోచుకోకపోవడం స్థానికులను తీవ్రంగా కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళితే.. సతారాలోని పర్లీ గ్రామానికి చెందిన ప్రమోద్ సైన్యంలో సేవలందిస్తూ ఉండగా, ఏడాది క్రితమే వివాహమైంది. ఇటీవల సెలవులపై స్వస్థలానికి రాగా.. డెలివరీ కోసం భార్యను ఆసుపత్రిలో చేర్పించి.. బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురై మరణించాడు.

అయితే ఈ ఘటన జరిగిన కొద్దీ గంటలకే ఆయన భార్య ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కూతురు పుట్టకముందే తండ్రి కన్నుమూయడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆదివారం ప్రమోద్ అంత్యక్రియలను సైనిక లాంఛనాలతో నిర్వహించగా, భర్త చివరి చూపు కోసం భార్యను, పుట్టిన శిశువును కూడా తీసుకువచ్చారు. ఆ దృశ్యం గ్రామస్తులందరినీ కంటతడి పెట్టించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story