ఫోటోలకు ఫోజులిస్తూ గుంతలో పడ్డ సమాజిక కార్యకర్త..వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

ఈ మధ్య కాలంలో ఫోటోల పిచ్చి పెరిగిపోతుంది. సమయం, సందర్భం ఏదైనా క్లిక్ అని ఓ ఫోటో దిగాల్సిందే. పబ్లిసిటీ పిచ్చి ఉన్నవాళ్లకు ఉండే ఫోటోల పిచ్చి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఫోటోలకు ఫోజులిస్తూ గుంతలో పడ్డ సమాజిక కార్యకర్త..వీడియో వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో ఫోటోల పిచ్చి పెరిగిపోతుంది. సమయం, సందర్భం ఏదైనా క్లిక్ అని ఓ ఫోటో దిగాల్సిందే. పబ్లిసిటీ పిచ్చి ఉన్నవాళ్లకు ఉండే ఫోటోల పిచ్చి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి తరవాత ఒకటి వరుస పెట్టి ఫోటోలు దిగి వెంటనే వాటిని సోషల్ మీడియాలో పెట్లాలని ఆరాటపడుతుంటారు. అలాంటి ఆరాటమే ఓ సమాజిక కార్యకర్త ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మధ్య ప్రదేశ్ లోని సియోనిలో ఓ ఆలయం నిర్మిస్తుండగా కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు.

అప్పటికే గుంతలు తవ్వి ఉండగా మట్టిని తీసుకువెళ్లి పక్కన వేస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్ ప్రఫుల్ శ్రీవాస్తవ అనే సమాజిక కార్యకర్త అక్కడకు చేరుకున్నాడు. అక్కడ పనిచేస్తున్న కార్మికుడి చేతిలో నుండి తట్టను తీసుకుని అందులో మట్టిని ఇవ్వమన్నాడు. ఈ క్రమంలో చూసుకోకుండా అతడు గుంత చివరకు వెళ్లాడు. అది కాస్తా కూలిపోవడంతో చివరికి గుంతలో పడిపోయాడు. ఫోటో సరిగ్గా రాలేదు మరో ఫోటో తీయమని చెబతూనే గుంతలో పడిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఫోటోల పిచ్చి ఉంటే ఇలాంటి ప్రమాదాలు తప్పవు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Next Story