- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీర్ బాటిల్‌లో దర్శనమిచ్చిన సిల్వర్ పేపర్.. అవాక్కైన మందుబాబు
మద్యపానం ఆరోగ్యానికి హానీకరమని ఎవరూ చెప్పినా వినరే. అసలే వేసవి కాలం.. ఓ చల్లని బీరేసి హాయిగా చిల్ అవుదామని అనుకున్న మందుబాబులకు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: మద్యపానం ఆరోగ్యానికి హానీకరమని ఎవరూ చెప్పినా వినరే. అసలే వేసవి కాలం.. ఓ చల్లని బీరేసి హాయిగా చిల్ అవుదామని అనుకున్న మందుబాబులకు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఏకంగా బీరు బాటిళ్లలో బల్లుల అవశేషాలు, ప్లాస్టిక్ స్పూన్లు దర్శనమిస్తున్నాయి. రూ.కోట్లలో లాభాలను ఆర్జిస్తున్న బేవరేజస్ ప్రజారోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సింది పోయి.. కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే మేడ్చల్ (Medchal) జిల్లా అన్నోజిగూడ (Annojiguda)లోని ఓ వైన్ షాప్‌లో విచిత్రం చోటుచేసుకుంది. బీర్ తాగుదామని ఓ వ్యక్తి రాయల్ చాలెంజ్ (Royal Challenge) బాటిల్‌ను కొనుగోలు చేశాడు. తీర మూత తీస్తుండగా ఓ మెరుస్తున్న సిల్వర్ పేపర్ బాటిల్‌లో ఉండటం గమనించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన వినియోగదారుడు ఇదేంటని వైన్ షాపు నిర్వాహకులను ప్రశ్నించగా.. బీర్ బాటిల్ తాము తయారు చేయలేదని, వెళ్లి కంపెనీ వాళ్లను నిలదీయండంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.






