- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. మొక్కు తీరాలంటే భక్తులు ఇలా చేయాలా!?
రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. చాలా మంది తమ కోరికలు నెరవేరాలని, మంచి జరగాలని ఇష్ట దేవతలను ఆరాధిస్తారు. అలాగే, దేవాలయాలకు వెళ్లి ముడుపులు కట్టి తాము కోరుకున్న కోరికలను తీర్చమని ఆ దేవుడిని ప్రార్థిస్తారు. ఈ తరుణంలో దేవాలయాలకు వెళ్లి పూజలు చేయడం, మంత్రాలు జపించడం, ఉపవాసాలు చేయడం, ఇంట్లో పూజలు చేసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇక, భక్తులు ఏ ఆలయానికి వెళ్లిన కొబ్బరికాయ(coconut)లు కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు.
కానీ తమిళనాడు రాష్ట్రంలో ఓ వింత ఆచారం చోటుచేసుకుంది. మొక్కు తీర్చుకోవాలంటే అక్కడి భక్తులు తలపై కొబ్బరికాయ కొట్టించుకునే వింత ఆచారం తమిళనాడులోని ఓ ఆలయంలో ఇప్పటికీ కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని కరూర్ జిల్లా మేట్టుమహదానపురంలో సుమారు 400 ఏళ్ల నాటి పురాతనమైన అరుళ్‌మిగు శ్రీమహాలక్ష్మి దేవాలయం ఉంది. ప్రతి సంవత్సరం ఆడి మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో భక్తులు(Devotees) 18 రోజులు దీక్ష చేపడతారు. ఇక, మరుసటి రోజు(19వ) తలపై కొబ్బరికాయ కొట్టించుకుని మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ ఏడాది సోమవారం(ఆగస్టు 04) మొక్కు తీర్చుకోవడానికి 800 మందికి పైగా భక్తులు ఆలయ ప్రాంగణంలో వరుసగా కూర్చున్నారు. ఈ క్రమంలో పూజారి భక్తుల తలపై కొబ్బరికాయలు కొట్టారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. వారి తలపై ఒకసారి కొట్టాగనే ఆ కొబ్బరికాయ పగిలితేనే మొక్కు తీరినట్లని అక్కడి భక్తులు భావిస్తారు. అయితే.. కొబ్బరి కాయలు కొట్టిన తరువాత చాలా మంది ఏమీ జరగనట్లు బయటకు నడుస్తూ వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కొంత మంది మాత్రం నొప్పితో తల రుద్దుకుంటూ కనిపిస్తారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ కావడంతో తమిళనాడు(Tamilnadu)లోని వింత ఆచారం బయటపడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.






