- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైకిల్‌పై ప్రచారం..బాంబు అనుకుని హడలిపోయిన విజయ్
తమిళనాడు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సైకిల్ తొక్కుతూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు విజయ్.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 23వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకు వెళ్తున్నాయి. అయితే ఈ సందర్భంగా తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ సైకిల్ పైన ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఓ వీడియో, ఇప్పుడు వైరల్ గా మారింది.
సైకిల్ పైన విజయ్ ప్రచారం.. అంతలోనే బాంబు అంటూ
తమిళనాడు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సైకిల్ తొక్కుతూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు విజయ్. అయితే సైకిల్ పైన విజయ్ ప్రచారం చేస్తున్న తరుణంలో... ఆయన వెంట వేలాది మంది అభిమానులు వచ్చారు. అటు సాధారణ ప్రజలు కూడా రోడ్డు ఎక్కారు. విజయ్ ని చూసేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ అభిమాని..విజయ్ సైకిల్ ముందు పూలు చల్లాడు.
ఇక ఆ పూలను విజయ్ ఏమనుకున్నాడో తెలియదు కానీ, నడిరోడ్డు పైన సైకిల్ వదిలేసి.. తన వాహనంలోకి వెళ్లిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. పూలు చల్లితే బాంబులు అనుకొని, విజయ్ పారిపోయాడని ఆడుకుంటున్నారు. విజయ్ కామెడీ పీస్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక విజయ్ ఫ్యాన్స్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ హడావిడి చేసిన నేపథ్యంలోనే విజయ్ అలా వెళ్లిపోయాడని కౌంటర్లు ఇస్తున్నారు. అనవసరంగా విజయ్ ట్రోల్స్ చేస్తే, ఊరుకునేది లేదంటూ సీరియస్ అవుతున్నారు.






