పత్తి చేనులోకి దూసుకెళ్లిన RTC బస్సు.. 40 మంది ప్రయాణికులు సేఫ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-18 05:47:20  IST  )

పత్తి చేనులోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటన కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల పరిధిలోని పరందోలి గ్రామ శివారులో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

పత్తి చేనులోకి దూసుకెళ్లిన RTC బస్సు.. 40 మంది ప్రయాణికులు సేఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: పత్తి చేనులోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటన కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి (Kerameri) మండల పరిధిలోని పరందోలి (Parandoli) గ్రామ శివారులో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ (Adilabad) వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న పత్తి చేనులోకి దూసుకెళ్లింది.

కాగా, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బ్రేకులు పని చేయకపోవడంతో డ్రైవర్ చాకచక్యంగా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా అతి కష్టం మీద రోడ్డు పక్కనే ఉన్న పత్తి పొలంలోకి మళ్లించాడు. ఈ క్రమంలోనే పొలంలో ఉన్న ఓ మహిళకు గాయాలు కాగా, పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానికులు, పోలీసుల సాయంతో ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణ నష్టం వాటిల్లలేదని ప్రయాణికులు, స్థానికులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, ఆర్టీసీ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.

Next Story