భోపాల్‌లో హైవేపై ఏర్పడ్డ భారీ అగాధం.. షాకింగ్ వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

భోపాల్‌లో హైవే రోడ్డుపై భారీ అగాధం ఏర్పడింది. సుఖీ సెవనియా సమీపంలో ప్రధాన రహదారి ఒక్కసారిగా కుంగిపోయింది. ఇండోర్ జబల్పూర్ బైపాస్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోగా ఒక్కసారిగా ప్రయాణికులు షాక్ అయ్యారు. అయితే ఘటన జరిగిన సమయానికి రోడ్డుపైకి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

భోపాల్‌లో హైవేపై ఏర్పడ్డ భారీ అగాధం.. షాకింగ్ వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: భోపాల్‌లో హైవే రోడ్డుపై భారీ అగాధం ఏర్పడింది. సుఖీ సెవనియా సమీపంలో ప్రధాన రహదారి ఒక్కసారిగా కుంగిపోయింది. ఇండోర్ జబల్పూర్ బైపాస్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోగా ఒక్కసారిగా ప్రయాణికులు షాక్ అయ్యారు. అయితే ఘటన జరిగిన సమయానికి రోడ్డుపైకి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన అధికారులు దాదాపు 30 అడుగుల మేర కుంగిపోయిందని చెబుతున్నారు. రిటైనింగ్ వాల్ దెబ్బతినడంతోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

నాసిరకంగా రోడ్డు నిర్మాణం చేపట్టడంతోనే దెబ్బతిన్నదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సైతం రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ పై, ప్రభుత్వంపై మండిపడుతున్నారు. నేతలు, అధికారులు అవినీతికి పాల్పడటం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో

Next Story