పిల్లి - ఎలుక కొట్లాట (వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-14 13:51:32  IST  )

* రియల్ లైఫ్ టామ్ అండ్ జెర్రీ * పిల్లి ఎలుక కొట్లాట.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ * ఇంతగా నవ్వుకుని చాలా కాలమైందని నెటిజన్లు కామెంట్స్

పిల్లి - ఎలుక కొట్లాట (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : టామ్ అండ్ జెర్రీ చూశారా? చూసే ఉంటారు లెండి. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో విధంగా.. ఫన్నీ ఫన్నీగా సాగిపోతుంది. పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. టామ్ అండ్ జెర్రీ వార్స్ అలా ఉంటాయి మరి. అయితే అది టీవీలో.. కానీ ఇక్కడ రియల్‌గానే ఓ పిల్లి, ఎలుక కొట్లాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్క్రీన్‌పై ఇలాంటి వీడియోలు ఎన్నో చూసుంటాం కానీ ఈ రియల్ వీడియో భలే కిక్కు ఇస్తుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఇంతగా నవ్వుకుని చాలా రోజులు అయిందని కామెంట్ చేస్తున్నారు. ‘పిల్లికి కోపం వచ్చింది’, ‘పాపం పిల్లి.. మోయే మోయే’, ‘రియల్ లైఫ్ టామ్ అండ్ జెర్రీ’ అంటూ కామెంట్ సెక్షన్‌ను నింపేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియో దాదాపు 25వేల వ్యూస్‌ రాగా సూపర్ వైరల్ అయిపోయింది.

Next Story