రసగుల్లాల రగడ.. పొట్టు పొట్టు కొట్టుకున్న బంధువులు.. చివరకు పెళ్లి రద్దు?

by Ramesh Naini |

బీహార్‌లో పెళ్లంటే డాన్స్‌, బిర్యానీ, బ్యాండ్‌ ఇవే కాకుండా ఫైటింగ్ కూడా కామనే అని నెటిజన్‌లు చెబుతున్నారు.

రసగుల్లాల రగడ.. పొట్టు పొట్టు కొట్టుకున్న బంధువులు.. చివరకు పెళ్లి రద్దు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీహార్‌లో పెళ్లంటే డాన్స్‌, బిర్యానీ, బ్యాండ్‌ ఇవే కాకుండా ఫైటింగ్ కూడా కామనే అని నెటిజన్‌లు చెబుతున్నారు. బోధ్‌గయలో నవంబర్ 29న జరిగిన ఒక పెళ్లిలో రసగుల్లాలు సరిపోకపోవడంతో ఇరు వర్గాల బంధువులు కుర్చీలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. అట్టహాసంగా పెళ్లి వేడుకలు కొనసాగుతుండగా.. డెజర్ట్ దగ్గరకు వచ్చేసరికి అతిథులు ‘రసగుల్లాలు అయిపోయాయి’ అని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ‘మీ వాళ్లే ఎక్కువగా తిన్నారు.. లేదు నీ వాళ్లే ఎక్కువగా తిన్నారు’ అని పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తరుపు బంధువులు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రారంభించారు. ఈ మాటల యుద్ధం కొద్ది నిమిషాల్లోనే కుర్చీల యుద్ధంగా మారిపోయింది.

సప్తపది రెడీ.. కానీ పెళ్లి క్యాన్సిల్

ఈ గొడవ జరుగుతున్న సమయంలో పెళ్లికొడుకు,పెళ్లికూతురు సప్తపది కోసం మండపానికి వెళ్లడానికి రెడీగా ఉన్న సమయానికి ఈ వార్త చెవిలో పడటంతో.. ఇరువర్గాలు ‘ఈ పెళ్లి వద్దు’ అంటూ వెనక్కి వెళ్లిపోయారు. దీంతో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడంతో వారు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. గొడవ అనంతరం వధువు కుటుంబం ‘రసగుల్లాలతో పాటు కట్నం మాట కూడా వచ్చింది’ అని వరుడు కుటుంబంపై వరకట్నం (డౌరీ) కేసు పెట్టారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్‌లు తీవ్రంగా స్పందించారు. రసగుల్లా వల్ల రగడ.. స్వీటు తక్కువైతే రిటర్న్ గిఫ్ట్‌గా ఫైట్ ఇస్తారా? అంటూ నెటిజన్లు కూడా తమదైన స్టైల్లో రియాక్ట్ అవుతున్నారు. బీహార్‌లో ఇలాంటి విచిత్రాలు కామన్ అని పలువురు నెటిజన్‌లు తీవ్ర విమర్శలు చేశారు. వీడియో ఇదే..

Next Story