- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైకల్యం కళ్లకే.. ఆశయానికి కాదు : కోడింగ్‌లో అద్భుతాలు సృష్టిస్తోన్న యువకుడు
తనకు చూపు లేదని కుంగిపోకుండా.. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు 19 ఏళ్ల యువకుడు. కోడింగ్ కింగ్ గా ప్రశంసలు అందుకుంటున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: ఆశయాన్ని సాధించాలన్న పట్టుదల ఉంటే.. దానికి ఆకాశమే హద్దు.. అంగవైకల్యం ఏమీ చేయలేదని నిరూపించాడు 19 ఏళ్ల యువకుడు. చదవడానికి, ఉద్యోగం లేదా పనిచేయడానికి ఎప్పుడూ ఏదొక సాకు చెప్తూ ఉండేవారికి ఇతనొక ఉదాహరణ. అతని జీవితమొక కనువిప్పు. పుట్టుకతోనే 100 శాతం అంధత్వం ఉన్నప్పటికీ, తన లోపాన్ని అడ్డంకిగా మార్చుకోకుండా కోడింగ్ లో సత్తా చాటుతున్నాడు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన ‘సక్షం ఫస్ట్ కోడర్స్’ (Saksham First Coders) పోటీల్లో ‘సీనియర్ అడ్వాన్స్‌డ్ పైథాన్’ కేటగిరీలో వ్రజ్ టాంక్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కళ్లు కనిపించకపోయినా, కంప్యూటర్ కోడింగ్‌లో అతను సాధించిన ఈ విజయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గుజరాత్‌లోని జూనాగఢ్‌కు చెందిన వ్రజ్.. పుట్టుకతోనే చూపు కోల్పోయాడు. తన ఐదో తరగతి వరకు జూనాగఢ్‌లోని రాష్ట్రీయ అంధజన్ మండల్‌లో చదువుకున్నాడు. ప్రస్తుతం నోబుల్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (BCA) నాలుగో ఏడాది చదువుతున్నాడు.
వ్రజ్ ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు తన సోదరి ఒక మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయడం తెలుసుకున్నాడు. అదే అతడికి టెక్నాలజీపై ఆసక్తిని పెంచింది. తొమ్మిదో తరగతిలోనే కేవలం మొబైల్ సహాయంతో HTML నేర్చుకోవడం విశేషం. పన్నెండో తరగతి పూర్తయ్యాక అంధత్వం కారణంగా అనేక కళాశాలలు అతనికి సీటు ఇచ్చేందుకు నిరాకరించాయి. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో పోరాడి.. నేడు కోడింగ్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. వ్రజ్ ప్రయాణంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






