VIDEO: ప్రీ వెడ్డింగ్ కాదు ప్రీ ఎంగేజ్మెంట్ షూట్.. ఇదే ఇప్పుడు కొత్త ట్రెండ్

by Ajay Maddhiboyina |

పెళ్లిళ్లకు సంబంధించి కొత్త కొత్త ట్రెండ్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు పెళ్లిరోజున ఫోటోలు, వీడియోలు తీసేవారు. అంతకు ముందు ఎప్పుడూ వధూవరులు కలిసి ఫోటోలు, వీడియోలు తీసుకునేవాళ్లు కాదు.

VIDEO: ప్రీ వెడ్డింగ్ కాదు ప్రీ ఎంగేజ్మెంట్ షూట్.. ఇదే ఇప్పుడు కొత్త ట్రెండ్
X

దిశ, వెబ్ డెస్క్: పెళ్లిళ్లకు సంబంధించి కొత్త కొత్త ట్రెండ్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు పెళ్లిరోజున ఫోటోలు, వీడియోలు తీసేవారు. అంతకు ముందు ఎప్పుడూ వధూవరులు కలిసి ఫోటోలు, వీడియోలు తీసుకునేవాళ్లు కాదు. కానీ ఆ తరవాత పెళ్లికి ముందు ఫోటోలు దిగే ట్రెండ్ వచ్చింది. ప్లెక్సీల కోసం, ప్రకటన కోసం ఇలా ఫోటోలు తీసుకునేవారు. ఇక ప్రస్తుతం పెళ్లికి ముందు ప్రీవెడ్డింగ్ పేరుతో వీడియో షూట్ చేసుకుంటున్నారు. సినిమాల రేంజ్ లో ప్రీవెడ్డింగ్ వీడియోలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు మరో ట్రెండ్ మొదలైంది. పెళ్లికే కాదు ఎంగేజ్మెంట్‌కు ముందు కూడా ప్రీఎంగేజ్మెంట్ షూట్‌లు మొదలైనట్టు కనిపిస్తుంది.

తాము ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాం అంటూ వధూవరులు వినూత్నంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ ప్రీఎంగేజ్మెంట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను కూడా బిల్లా సినిమా రేంజ్ లో షూట్ చేయడం విశేషం. అబ్బాయి కార్ నుండి దిగగానే అతడి చుట్టూ కొందరు బౌన్సర్లు ఉంటారు. వధువు కార్ దిగగానే ఆమె చుట్టూ కొందరు బౌన్సర్లు వస్తారు. ఇలా ఇద్దరూ కలుసుకున్న తరవాత వరుడు వధువుకు సూట్ కేస్ ఇవ్వగా అందులో ఎంగేజ్మెంట్ డేట్ కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో డబ్బులు ఎక్కువ అయితే ఇలాంటి ఐడియాలే వస్తాయ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. video

Next Story