దయచేసి యుద్దం ఆపేయండి.. మోడీ కాళ్లపై పడిన పాక్ ప్రధాని.. ఏఐ వీడియో వైరల్

by Ramesh Goud |   (  Updated:2025-05-07 18:43:06  IST  )

దయచేసి యుద్దం ఆపేయండి అంటూ.. పాక్ ప్రధాని మోడీ కాళ్లపై పడుతున్న ఏఐ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

దయచేసి యుద్దం ఆపేయండి.. మోడీ కాళ్లపై పడిన పాక్ ప్రధాని.. ఏఐ వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: దయచేసి యుద్దం ఆపేయండి అంటూ.. పాక్ ప్రధాని, మోడీ కాళ్లపై పడుతున్న ఏఐ వీడియో (AI Video) నెట్టింట వైరల్ (Viral) గా మారింది. పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)కి ప్రతీకారంగా భారత్.. పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ (Operation Sondoor) అమలు చేసింది. ఈ దాడిలో దాదాపు 100 పైగా ఉగ్రవాదులు మరణించి ఉంటారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్ పాక్ బార్డర్ (Bharath Pak Border) లో ఇప్పటికే యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి.

ఉగ్రవాదుల ఏరివేత పేరుతో భారత్ పాకిస్థాన్ పై ఏ క్షణమైన దాడి చేయోచ్చనే వార్తలు ఊపందుకుంటున్నాయి. దీంతో పాకిస్థాన్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఉగ్రవాదంపై పోరులో భాగంగా భారత్ చేపడుతున్న దాడులకు అగ్రదేశాల మద్దతు కూడా లభించడంతో పాకిస్థాన్ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. భారత్ ఏ సమయంలో ఏ రకంగా దాడి చేస్తోందోనని పాక్ ప్రాణాలు అరచేత పట్టుకొని జీవిస్తోంది. ఈ క్రమంలోనే భారత్ -పాక్ యుద్దంపై కొన్ని ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇందులో ఓ వీడియోలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ (Pak PM Shehabaz Shareef) పై భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) పిడిగుద్దులతో తీవ్రంగా దాడి చేస్తున్నట్లుగా ఉండగా.. మరో వీడియోలో పాక్ ప్రధాని, నరేంద్ర మోడీ కాళ్లపై పడి, దయచేసి యుద్దం ఆపేయండి అని వేడుకుంటున్నట్లుగా ఏఐ వీడియోను సృష్టించారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఎమోషనల్ అవుతున్నారు. యుద్దం ఎట్టిపరిస్థితుల్లో ఆపేది లేదని, ఈ ఏఐ వీడియోను మోడీ నిజం చేస్తారని పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

Click For Tweet..

Next Story