- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Video : ప్లీజ్.. మాకు హెల్ప్ చేయండి.. వనస్థలిపురం ఓల్డేజ్ హోమ్ వృద్ధుల అభ్యర్థన..
కొన్ని వీడియోలు మనసుకు బాధను కలిగిస్తాయి. కాసేపు ఆగి ఆలోచించమని, చేతనైన సహాయం అందించమని చెప్తాయి. ఒకప్పుడు బిడ్డలను బాధ్యతాయుతంగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఇప్పుడు అనాథలుగా మారి..

దిశ, వెబ్ డెస్క్ : కొన్ని వీడియోలు మనసుకు బాధను కలిగిస్తాయి. కాసేపు ఆగి ఆలోచించమని, చేతనైన సహాయం అందించమని చెప్తాయి. ఒకప్పుడు బిడ్డలను బాధ్యతాయుతంగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఇప్పుడు అనాథలుగా మారి.. సహాయం కోరుతున్నారు. మమ్మల్ని ఆదుకోమంటూ అభ్యర్థిస్తున్నారు. జీవితపు చివరి రోజులను ఓ అనాథాశ్రమంలో జీవిస్తున్నామని.. ప్లీజ్ మాకు హెల్ప్ చేయండంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
తాము 26 మంది ఉన్నామని.. వనస్థలిపురంలోని ఉచిత అనాథాశ్రమంలో జీవిస్తున్నామని.. మనసును హత్తుకునే విధంగా.. ఈ జనరేషన్‌కు అర్థమయ్యే విధంగా స్టోరీ షేర్ చేశారు. మీకు నిజంగా హెల్ప్ చేయాలనిపిస్తే ఈ నంబర్‌కు కాల్ చేయమంటూ ఫోన్ నంబర్ కూడా షేర్ చేశారు. ఇక ఈ అభ్యర్థనకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండగా.. మీకు కూడా సహాయం చేయాలని ఉంటే ఈ వీడియోలో ఉన్న డిటెయిల్స్‌తో నిర్వాహకులను కాంటాక్ట్ చేయొచ్చు. తక్షణమే హెల్ప్ చేయొచ్చు.






