VIDEO: రన్నింగ్ ట్రైన్ నుండి పడిపోయిన ప్రయాణికుడు.. కాపాడిన కానిస్టేబుల్

by Ajay Maddhiboyina |

కాచిగూడ రైల్వే స్టేషన్‌లో రన్నింగ్ ట్రైన్ నుండి దిగుతున్న ప్రయాణికుడికి ప్రమాదం తృటిలో తప్పింది. ఓ ప్ర‌యాణికుడు వేగంగా క‌దులుతున్న ట్రైన్ దిగేందుకు ప్ర‌య‌త్నిచంగా కింద‌ప‌డిపోయాడు. త‌ర‌వాత ట్రైన్ అత‌డిని ముందుకు నెట్టుకుంటూ వెళ్లింది.

VIDEO: రన్నింగ్ ట్రైన్ నుండి పడిపోయిన ప్రయాణికుడు.. కాపాడిన కానిస్టేబుల్
X

దిశ, వెబ్ డెస్క్: కాచిగూడ రైల్వే స్టేషన్‌లో రన్నింగ్ ట్రైన్ నుండి దిగుతున్న ప్రయాణికుడికి ప్రమాదం తృటిలో తప్పింది. ఓ ప్ర‌యాణికుడు వేగంగా క‌దులుతున్న ట్రైన్ దిగేందుకు ప్ర‌య‌త్నిచంగా కింద‌ప‌డిపోయాడు. త‌ర‌వాత ట్రైన్ అత‌డిని ముందుకు నెట్టుకుంటూ వెళ్లింది. అక్క‌డే ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పంక‌జ్ శ‌ర్మ అత‌డిని చూసి ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు. ప‌ట్టుకుని ప‌క్క‌కు లాగ‌టంతో ప్ర‌యాణికుడు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. త‌ర‌వాత ప్రయాణికుడిని అక్క‌డ నుండి తీసుకెళ్లారు. యువ‌కుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ను ప్రయాణికులు అభినందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. video

Next Story