- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరావళి కోసం నెటిజన్ల పోరాటం.. ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ సేవ్ ఆరావళి
ఆరావళి పర్వతాలను కాపాడాలంటూ సోషల్ మీడియాలో పోరాటం ఉదృతం అయింది.

దిశ, వెబ్ డెస్క్ : ఆరావళి పర్వతాలను కాపాడాలంటూ సోషల్ మీడియాలో పోరాటం ఉదృతం అయింది. హ్యాష్ ట్యాగ్ సేవ్ ఆరావళి అంటూ భారీ ఎత్తున చేస్తున్న ఉద్యమం ఊపందుకుంది. లక్షలాది నెటిజన్స్ సేవ్ ఆరావళికి మద్దతు తెలుపుతున్నారు. అడవులను కాపాడకుండా కార్పొరెట్స్ కు కట్టబెట్టే ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వాన్ని, న్యాయవ్యవస్థను నిలదీస్తున్నారు. అయితే ఇటీవల 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉంటేనే వాటిని కొండలనే ఆరావళి పర్వతాలుగా గుర్తించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అప్పటి నుంచి ఆరావళి పర్వతాలను కాపాడే ఉద్యమం మరింత ఉదృతం అయింది. అలాగే రాజస్థాన్ లోని లక్షలాది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదికి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.
ఆరావళిని కార్పొరేట్స్ కు కట్టబెడితే.. అక్కడ మైనింగ్, అక్రమ కట్టడాలు, ఎడారి ధూళి విపరీతంగా పెరుగుతుందని పర్యావణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎడారి ప్రాంతంగా ఉన్న రాజస్థాన్ మరింత దుర్భర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవాప్యంగా నెటిజన్స్, విద్యార్థులు, పర్యావరణవేత్తలు తీవ్ర నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. విపక్షాలు సైతం ఆరావళి విధ్వంసాన్ని ఆపాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి.






