టాయిలెట్ ట‌బ్ లో మ‌ట‌న్ క‌ర్రీ...లొట్టలు వేసుకుంటూ తింటూ !

by velandi.Saikiran |   (  Updated:2025-09-09 12:39:27  IST  )

టాయిలెట్ ట‌బ్‌లోనే మ‌ట‌న్ క‌ర్రీ వండేశాడు. అటు మ‌గాళ్లు వెళ్తే టాయిలెట్ కుండిలో అన్నం వండేశారు.

టాయిలెట్ ట‌బ్ లో మ‌ట‌న్ క‌ర్రీ...లొట్టలు వేసుకుంటూ తింటూ !
X

దిశ‌, వెబ్ డెస్క్ : సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల వీడియోలు వైర‌ల్ అవుతూ ఉంటాయి. ఇంట‌ర్ నెట్ విప‌రీతంగా జ‌నాలు వాడుతున్న నేప‌థ్యంలో... ర‌క‌రకాల వీడియోలు వ‌స్తున్నాయి. అయితే.. తాజాగా టాయిలెట్ ట‌బ్‌, కుండిల‌లో వంట‌లు చేసి...స‌రికొత్తగా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.

ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఈ మ‌ధ్య కాలంలో చెఫ్ అవ‌తారం ఎత్తిన మ‌గాళ్లు... ర‌క‌ర‌కాల ఎక్స్‌పర్ మెంట్స్ చేస్తూ...ఫుడ్ వండేస్తున్నారు. ఇక తాజాగా టాయిలెట్ ట‌బ్‌లోనే మ‌ట‌న్ క‌ర్రీ వండేశాడు. అటు మ‌గాళ్లు వెళ్తే టాయిలెట్ కుండిలో అన్నం వండేశారు. వాస్త‌వానికి అందులో వండలేదు కానీ...బ‌య‌ట పోయ్యిపైన మ‌ట‌న్ , రైస్ ప్రిపేర్ చేశారు.

అనంత‌రం... టాయిలెట్ ట‌బ్‌, కుండి రెండు క్లీన్ చేశారు. శుభ్రంగా క‌డిగిన త‌ర్వాత టాయిలెట్ టబ్ లో మ‌ట‌న్ క‌ర్రీ వేశారు. ఆ త‌ర్వాత‌.. కుండిలో రైస్ వేశారు. అనంత‌రం... ప్లేట్ పెట్టుకుని తినేశారు. ఈ వీడియో వైర‌ల్ గా మారింది. దీనిని చూసిన జ‌నాలు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఇదెక్క‌డి మాయ రోగం రా మీకు అంటూ నెటిజ‌న్స్ రియాక్ట్ అవుతున్నారు. క్లిక్

Next Story