- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లి చావును కంటెంట్‌గా వాడుకున్న కొడుకు.. అసలు మనిషేనా?? (వీడియో)
తల్లి చనిపోయిందంటే భరించలేని దు:ఖం వెంటాడుతుంది. అసలు నేనెలా బతుకుతానా అనే దిగులుతో కన్నీళ్లు వరదలా కారుతుంటాయి. తల్లి కూడా తాను పోతే నా కొడుకు ఎలా బతుకుతాడో అని బెంగ పెట్టుకుంది. కానీ ఈ కొడుకుకు అలాంటి బెంగ లేదు.

దిశ, వెబ్ డెస్క్ : తల్లి చనిపోయిందంటే భరించలేని దు:ఖం వెంటాడుతుంది. అసలు నేనెలా బతుకుతానా అనే దిగులుతో కన్నీళ్లు వరదలా కారుతుంటాయి. తల్లి కూడా తాను పోతే నా కొడుకు ఎలా బతుకుతాడో అని బెంగ పెట్టుకుంది. కానీ ఈ కొడుకుకు అలాంటి బెంగ లేదు. అమ్మ చనిపోయిందనే బాధ లేదు.. ఆమె మరణాన్ని కంటెంట్‌గా వాడుకున్నడు. వ్యూస్ మాయలో పడి.. ఆమె చావును వ్లాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. హాస్పిటల్‌లో తల్లి చనిపోయినప్పటి నుంచి అంబులెన్స్‌లో గ్రామానికి తీసుకురావడం.. అంత్యక్రియలు చేయడం వరకు.. అన్నింటినీ రీల్ చేసి పెట్టాడు.
ఇక ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇలాంటి వెధవలు కూడా ఉంటారా అని తిట్టిపోస్తున్నారు జనాలు. దు:ఖాన్ని కంటెంట్‌గా మారుస్తున్న ఈ తరం నిజంగా నాశనమైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘వీడికి కొంచెం కూడా దు:ఖం లేదు’, ‘ఏం కొడుకు.. అసలు ఏం చేస్తున్నడు.. మనుషులుగా మనం ఎటు పోతున్నాం’, ‘తల్లి పోయినా వ్లాగ్ మాత్రం లేట్ కాకూడదు అన్నట్లు ఉంది’, ‘ఇంత పాపపు పనికి ఒడిగడుతారా??’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






