పిల్లలు రావట్లేదని...కోతులే ఆడుకుంటున్నాయి

by velandi.Saikiran |   (  Updated:2026-01-13 05:10:51  IST  )

కోతులు జారుడు బ‌ల్లాపై ఆడుకున్న‌ వీడియో వైరల్ గా మారింది.

పిల్లలు రావట్లేదని...కోతులే ఆడుకుంటున్నాయి
X

దిశ‌, వెబ్ డెస్క్‌: సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఈ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే, మరికొన్ని భయానకంగా ఉంటున్నాయి. ఇక మరికొన్ని అయితే చిన్నపిల్లలను అలరించేలా, ఆకట్టుకునేలా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా కోతులు జారుడు బ‌ల్లాపై ఆడుకున్న‌ వీడియో వైరల్ గా మారింది.

జారుడు బ‌ల్లాపై ఆడుకున్న‌ కోతులు

కోతులు ఈ మధ్యకాలంలో ఇళ్లల్లోకి వచ్చి రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఊరిలో కూడా ఈ కోతుల బెడద ఉంది. ఎన్ని కట్టడి చర్యలు తీసుకున్నప్పటికీ, కోతుల బాధ తప్పడం లేదు. అయితే, తాజాగా ఓ ఊరిలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కోతులు చేసిన పని అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చిన్నపిల్లలు ఆడుకునే జారుడుబల్లాపై కోతులు ఎగిరి గంతేసాయి.

అచ్చం చిన్నపిల్లల తరహాలోనే, ఆ జారుడు బల్లాపై, కిందికి జారుతూ ఎంజాయ్ చేశాయి. ఒకదాని తర్వాత ఒకటి, జాలిగా ఆడుకున్నాయి. మనుషుల లాగా కొట్టుకోకుండా, క్రమశిక్షణ పాటిస్తూ చిల్ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ ఫిదా అయిపోతున్నారు. పిల్లలు లేరు కదా అని, హ్యాపీగా జారుడు బల్లాపై ఆడుకుంటున్నాయని కామెంట్స్ చేస్తున్నారు జనాలు.










Next Story