నడిరోడ్డుపై భార్య మరణం... సహాయం చేసే దిక్కులేక చివరికి ఏం చేసాడో తెలుసా?

by Muthe.Rajitha |   (  Updated:2025-08-11 11:39:32  IST  )

మహారాష్ట్రలో ఓ హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది.

నడిరోడ్డుపై భార్య మరణం... సహాయం చేసే దిక్కులేక చివరికి ఏం చేసాడో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో ఓ హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. భార్య చనిపోవడంతో, ఎవ్వరూ సహాయం చేయక భార్య శవాన్ని బైక్ వెనకాల కట్టి తీసుకు వెళ్ళాడు. మహారాష్ట్రలోని నాగపూర్ కు చెందిన అమిత్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి లోనారా నుంచి కరణ్ పురకునాగపూర్-జబల్ పూర్ నేషనల్ హైవేపై ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని ట్రక్కు ఢీకొట్టింది. అమిత్ స్వల్ప గాయాలతో బయటపడగా.. అతని భార్య తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోగా అటుగా వెళ్లే వాహనాలను సహాయం చేయమని వేడుకున్నాడు. ఎవ్వరూ ఒక్క వాహనం కూడా ఆపకపోవడంతో ఆమె అక్కడే మృతి చెందింది.

అయితే తన భార్య శవం తరలించడానికి అయినా సహాయం చేయమని ఎంత ఆర్తనాదాలు చేసినా ఒక్కరు కూడా రాకపోవడంతో ఏం చేయాలో తెలియక భార్య శవాన్ని బైక్ వెనకాల కట్టి, తన స్వగ్రామానికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేసాడు. అయితే దారిలో దీనిని గమనించినవారు పోలీసులకు సమాచారం అందించగా.. వారికి తన దీనగాథను తెలిపాడు. పోలీసులు అంబులెన్సును రప్పించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

Next Story