- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డుపైనే సర్జరీ చేసి ప్రాణం కాపాడిన డాక్టర్లు.. నెట్టింట ప్రశంసల జల్లు
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని కాపాడేందుకు ముగ్గురు డాక్టర్లు రోడ్డుపైనే సర్జరీ చేసి అతడి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని కాపాడేందుకు ముగ్గురు డాక్టర్లు రోడ్డుపైనే సర్జరీ చేసి అతడి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. కేరళలోని ఉదయమ్పేరూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరగ్గా చాలా మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఒక బాధితుడి పరిస్థితి విషమించగా అదే రోడ్డుపై వెళుతున్న డాక్టర్ థామస్ పీటర్, అతని భార్య డాక్టర్ దిడియా థామస్ మరో డాక్టర్ మనోప్ వెంటనే స్పందించారు.
బాధితుడు శ్వాస తీసుకునేందుకు చాలా ఇబ్బంది పడటం, అంబులెన్స్ వచ్చే అంత సమయం లేకపోవడంతో రోడ్డుపైనే మైనర్ సర్జరీ చేసి అతడిని కాపాడారు. డాక్టర్ థామస్ పీటర్, అతడి భార్య ఎర్నాకులంలోని మెడికల్ కాలేజీలో కార్డియాలజీ సర్జరీ విభాగంలో పనిచేస్తున్నారు. మనోప్ సైతం అదే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా రాజకీయనాయకులు, ప్రముఖులు వీరిని అభినందిస్తున్నారు. నెటిజన్లు సైతం డాక్టర్లు చేసిన పనికి వారిని అభినందిస్తున్నారు.






