- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Joe Biden vibes: జో బైడెన్ వైబ్స్.. విమానం ఎక్కుతూ తూలిపడిన ట్రంప్.. నెటిజన్ల ట్రోలింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమానం ఎక్కుతూ జారిపడ్డారు. విమానం ఎక్కే సమయంలో మెట్లపై ఆయన కాలు తట్టుకోని తూలిపడిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Viral Video) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) విమానం ఎక్కుతూ జారిపడ్డారు. విమానం ఎక్కే సమయంలో మెట్లపై ఆయన కాలు తట్టుకోని తూలిపడిపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. ఆదివారం, క్యాంప్ డేవిడ్, మేరీల్యాండ్‌కు పర్యటనలో భాగంగా (New Jersey) న్యూజెర్సీలోని మోరిస్‌టౌన్‌లోని మోరిస్‌టౌన్ మున్సిపల్ విమానాశ్రయంలో (Air Force One) ఎయిర్ ఫోర్స్ వన్ మెట్లు ఎక్కుతూ.. ట్రంప్ తూలిపడ్డారు. అయితే ట్రంప్ తర్వాత అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో సైతం తూలి పడటం గమనార్హం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అమెరికా మాజీ అధ్యక్షుడు (Joe Biden) జో బైడెన్‌తో నెటిజన్లు పోల్చారు.
ఈ మేరకు ట్రంప్‌తో బైడెన్ వీడియోలు జోడిస్తూ నెటిజన్స్ తెగ ట్రోల్స్ చేశారు. గతంలో జో బైడెన్ అదే విధంగా తూలి పడటంతో.. ఆయన విమానం కూడా ఎక్కలేకపోతున్నారని ట్రంప్ ఎగతాళి చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తు చేస్తూ ఘటన వీడియోలు పోస్ట్ చేశారు. మెట్ల రెయిలింగ్ పట్టుకోక పోయిఉంటే ట్రంప్ ముఖం పగిలేదని పలువురు నెటిజన్‌లు విమర్శలు చేశారు. ట్రంప్‌ను మెట్ల మీద పడిపోవడం చూస్తుంటే ‘జో బైడెన్ వైబ్స్’ అంటూ నెటిజన్లు వీడియోలు షేర్ చేశారు. మరోవైపు ట్రంప్ స్థానంలో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యి ఉంటే.. ఇప్పటికే టీవీ చానల్స్‌లో బ్రేకింగ్ న్యూస్ పెట్టేవారని ఓ నెటిజన్ కామెంట్ ఆసక్తికరంగా మారింది.






