Virat Kohli: ఇన్‌స్టా‌లో 274 మిలియన్ల ఫాలోవర్లు.. ఒక్క పోస్ట్‌కి కోట్లు తీసుకుంటున్న కోహ్లీ!

by Gantepaka Srikanth |

టీమిండియా(Team India) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Virat Kohli: ఇన్‌స్టా‌లో 274 మిలియన్ల ఫాలోవర్లు.. ఒక్క పోస్ట్‌కి కోట్లు తీసుకుంటున్న కోహ్లీ!
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. తాజాగా విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్స్‌స్టాగ్రామ్‌(Instagram)లో విరాట్ కోహ్లీకి 274 మిలియన్ల ఫాలోవర్లున్నారు. ఆసియాలోనే అత్యధిక ఫాలోవర్లున్న కోహ్లీ ఒక్క పోస్ట్‌కు ఎంత తీసుకుంటారనే విషయాన్ని Influencer Marketing Hub వెల్లడించింది. విరాట్ ఒక్క ఇన్స్టా పోస్ట్ ద్వారా రూ.12 కోట్లు సంపాదిస్తారని తెలిపింది. ఈ జాబితాలో ఫుట్‌బాల్ ప్లేయర్ రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నారు. రొనాల్డో ఒక్క పోస్ట్‌కి రూ.27 కోట్లు తీసుకుంటారని పేర్కొంది. ఆయన తర్వాత మరో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి ఉన్నారు. మెస్సి ఒక్క పోస్ట్‌కు రూ.22 కోట్లు తీసుకుంటున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీనే ఉండటం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా ఇన్స్‌స్టాగ్రామ్‌ నుంచి సంపాదించే టాప్ 20 జాబితాలో ఇండియా నుంచి విరాట్ కోహ్లీ ఒక్కడే ఉన్నారు. దీంతో కోహ్లీని ఫ్యాన్స్‌ ఆకాశానికెత్తేస్తున్నారు.

Next Story