పూరీ జగన్నాథ్ ఆలయం వద్ద అద్భుతం.. కళ్లు తెరిచిన కోమాలోకి వెళ్లిన బాలుడు

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-25 17:21:36  IST  )

ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయం(Puri Jagannath Temple) వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

పూరీ జగన్నాథ్ ఆలయం వద్ద అద్భుతం.. కళ్లు తెరిచిన కోమాలోకి వెళ్లిన బాలుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయం(Puri Jagannath Temple) వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కోమాలోకి వెళ్లిన బాలుడు అనూహ్యంగా కళ్లు తెరిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన ప్రకాష్‌కు నిఖిల్ అనే కుమారుడు ఉన్నాడు. నిఖిల్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల కోమాలోకి వెళ్లాడు. అనేక ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఎంతో మంది డాక్టర్లకు చూపించారు. అయినా నయం కాలేదు. తాజాగా కోమాలో ఉన్న కొడుకు నిఖిల్‌కు తీసుకొని తండ్రి ప్రకాష్ పూరీ శ్రీమందిర్‌కు వచ్చాడు. నిఖిల్‌ను పడుకోబెట్టి ప్రార్థనలు చేశాడు. అనూహ్యంగా నిఖిల్ కళ్లు తెరిచి చూశాడు. ఆనందంలో తండ్రి ఎగిరి గంతేయడంతో అక్కడున్న వాళ్లంతా అవాక్కయ్యారు. తండ్రి భావోద్వేగం చూసి.. అందరూ ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో

Next Story