- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుర్గా మాత ఒక వేశ్య అంటూ పాట.. ఫోక్ సింగర్‌పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
మరికొద్ది రోజుల్లో నవరాత్రులు స్టార్ట్ కాబోతున్నాయి. దుర్గామాత తొమ్మిది రోజులు పూజలు అందుకోబోతుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు భక్తులు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్‌కు చెందిన ఫోక్ సింగర్

దిశ, వెబ్ డెస్క్ : మరికొద్ది రోజుల్లో నవరాత్రులు స్టార్ట్ కాబోతున్నాయి. దుర్గామాత తొమ్మిది రోజులు పూజలు అందుకోబోతుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు భక్తులు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్‌కు చెందిన ఫోక్ సింగర్ సరోజ్ సర్గం చేసిన పనికి దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. దుర్గామాత ఒక వేశ్య అంటూ పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పొట్టు పొట్టు తిడుతున్నారు. లైవ్ సేషన్‌లో పాడుతున్న పాటలో హిందూ దేవతలను అవమానించింది సింగర్.
విష్ణు మూర్తిని హంతకుడు అని.. దుర్గమ్మను వేశ్య అని.. ప్రహ్లాదుడిని తాగుబోతు అని వ్యాఖ్యానించింది. హిందూ ఆచారాలు, పండుగలను దారుణంగా అవమానింది. రిజర్వేషన్ల గురించి ప్రస్తావిస్తూ రాజకీయ నాయకులపై బూతులు వాడింది. ఇందుకు సంబంధించిన రెండు నిమిషాల క్లిపింగ్ వైరల్ అవుతుండగా.. కేవలం జనాల అటెన్షన్ క్యాచ్ చేసేందుకే ఇలాంటి పదాలను వాడుతుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టినందుకు ఐపీసీ సెక్షన్ 295ఏ కింద కేసు పెట్టాలని కోరుతున్నారు.






