గుండెల్ని పిండేసే దృశ్యం.. అమ్మ కోసం మండుటెండలో ఎనిమిదేళ్ల బాలుడి పోరాటం

by Prasad Jukanti |

ఎండలకు స్పృహతప్పి పడిపోయిన తన తల్లిని కాపాడుకునేందుకు ఓ బాలుడు చేసిన ప్రయత్నం అందరిని కంటతడిపెట్టిస్తోంది.

గుండెల్ని పిండేసే దృశ్యం.. అమ్మ కోసం మండుటెండలో ఎనిమిదేళ్ల బాలుడి పోరాటం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కన్న బిడ్డల ఆలనా పాలన కోసం తల్లి పడే ప్రయాసం మనందరికి తేలిసిందే. కానీ కన్నతల్లి ఆపదలో ఉంటే ఓ పసి ప్రాణం విలవిలలాడిపోయిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ కలిచివేసేలా చేస్తోంది. మండుతున్న ఎండలో తన తల్లి స్పృహతప్పి పడిపోవడంతో ఆమెను కాపాడుకునేందుకు ఎనిమిదేళ్ల బాలుడు చేసిన పోరాటం అందరిని కంటతడిపెట్టేలా చేస్తోంది. యూపీలోని కాన్పూర్‍లో (Kanpur) జరిగినట్లుగా చెప్పబడుతున్న ఈ వీడియో చూస్తే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. తీవ్రమైన వేడికి తట్టుకోలేక ఓ మహిళ రోడ్డుపైనే స్పృహతప్పి పడిపోయింది. అదే సమయంలో ఆమెతో పాటే ఉన్న ఎనిమిదేళ్ల కుమారుడు తన కళ్లముందే తల్లి పడిపోవడాన్ని చూసి తల్లడిల్లిపోయాడు.

ఎండను లెక్క చేయకుండా:

ఏం చేయాలో పాలుపోక, అమ్మను లేపేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమెలో చలనం లేకపోవడంతో ప్రాణ సమానమైన అమ్మ కోసం ఆ చిన్నారి పోరాటమే చేశాడు. మండుటెండలో తన కాళ్లకు చెప్పులు లేకపోయినా పరుగు పరుగునా వెళ్లి బాటిల్ లో నీళ్లు తీసుకువచ్చి తన తల్లి చేత తాగించాడు. కొడుకు సపర్యలకు కోలుకున్న తల్లి లేని కూర్చుంది. తన తల్లికోసం చిన్నారి చేసిన ఈ పోరాటాన్ని స్థానికులు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తల్లి కోసం బాలుడి తపనను చూసిన నెటిజన్లు చలించిపోతున్నారు.

Next Story