- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video: బొద్దింకల బండిని ఎప్పుడైనా చూశారా?
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవ్వటం చూస్తూంటాం. వీటిలో కొన్ని వీడియోలు కొన్ని ఆహ్లాదకరంగా, ఆశ్చర్యంగా, మరికొన్ని వీడియోలు అవాక్కయ్యేలా, ఇంకొన్ని ఫన్నీగా ఉంటాయి.

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో (Social media) నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ (Viral) అవ్వటం చూస్తూంటాం. వీటిలో కొన్ని వీడియోలు కొన్ని ఆహ్లాదకరంగా, ఆశ్చర్యంగా, మరికొన్ని వీడియోలు అవాక్కయ్యేలా, ఇంకొన్ని ఫన్నీగా ఉంటాయి. ఇక తాజాగా నెట్టింట బొద్దింకలకు (Cockroaches) సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ వీడియోలో ఏముందంటే.. బొద్దింకలు బండి నడుపుతూ పరిగెడుతున్నాయి. మరీ ఆ వింత ఏమిటో మీరు కూడా చూసేయండి.
సాధారణంగా బొద్దింకలు అంటే మనకు భయం, అసహ్యం కలిగించే జీవులు. కానీ ఈసారి నెటిజన్ల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. వైరల్ అవుతోన్న వీడియోలో ఒక ఇంట్లో రెండు బొద్దింకలు అటు ఇటు పరుగెడుతుండగా, ఓ వ్యక్తి వాటిని జాగ్రత్తగా పట్టుకున్నాడు. చిన్నగా తయారు చేసిన రెండు చక్రాల బండిపై వాటిని అతికించాడు. అలా అమర్చిన తర్వాత వాటిని వదలగానే.. బండిని లాగుతూ పరిగెత్తటం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'ఇది బొద్దింకల లోకంలో ఫార్ములా-1 రేస్' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు ఫన్నీగా 'ఇవన్నీ చూడటానికే ఇంట్లో బొద్దింకలను సహించాలి' అంటుండగా, మరికొందరు 'ఇక బొద్దింకల యుగం మొదలైంది' అని ఫన్నీగా స్పందిస్తున్నారు.






