- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలెక్టర్ మేడం మీకు హ్యాట్సాఫ్..! పాలనే కాదు పాటతోనూ అదరగొట్టారు
ఆడపిల్ల అని తలిస్తేనే కడపులోనే చంపేసే కాలం ఇది. భ్రూణ హత్యలు నేరమని ప్రభుత్వాలు ఏళ్లుగా ప్రచారం చేస్తున్న సామన్య ప్రజల్లో నేటికీ ఏమాత్రం మార్పు రావడం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: ఆడపిల్ల అని తలిస్తేనే కడపులోనే చంపేసే కాలం ఇది. భ్రూణ హత్యలు నేరమని ప్రభుత్వాలు ఏళ్లుగా ప్రచారం చేస్తున్న సామన్య ప్రజల్లో నేటికీ ఏమాత్రం మార్పు రావడం లేదు. ఆడపిల్ల పుట్టిందంటే తమ పాలిట గుదిబండలా భావిస్తున్న తల్లిదండ్రులు కోకొల్లలు. ఈ క్రమంలోనే భ్రూణహత్యలు, బాలికల విద్య, సాధికారతలపై అవగాహన పెంచే లక్ష్యంతో అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి (Collector Pamela Satpathy) చేసిన ఓ ప్రయత్నానికి మహిళా లోకం జై కొడుతోంది.
ఈ సందర్భంగా ఆమె స్వయంగా పాడిన ‘ఓ చిన్ని పిచ్చుక, చిన్నారి పిచ్చుక’ అనే సాంగ్ సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. హిందీ రచయిత స్వానంద్ కిర్కిరే (Swanand Kirkire) రచించిన ఆ పాటకు నంది శ్రీనివాస్ (Nandi Srinivas) తెలుగులో అనువాదం చేయగా కలెక్టర్ పమేలా సత్పతి ఆలపించారు. ప్రస్తుతం ఆమె పాడిన పాట బాలికల విషయంలో సమాజంలో సానుకూల మార్పులకు దోహదపడే అవకాశం కలిగుతుందని సామాజివేత్తలు కామెంట్ చేస్తున్నారు. నిత్యం జిల్లా పాలనా వ్యవహాల్లో ఉండే కలెక్టర్ పమేలా సత్పతి పాట పడటం చూసిన తోటి ఉద్యోగులు, కరీంనగర్ జిల్లా ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నా. ‘మా కలెక్టర్ మల్టీ టాలెంటెడ్’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం కామెంట్ చేస్తున్నారు.






