కటింగ్ చేయించుకున్న కోతి..సుద్దపూసలా కూర్చొని మరీ

by velandi.Saikiran |

హీరో లుక్ కోసం కటింగ్ చేయించుకున్న కోతి సంఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో చోటు చేసుకుంది.

కటింగ్ చేయించుకున్న కోతి..సుద్దపూసలా కూర్చొని మరీ
X

దిశ‌, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో రక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని భయానకంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ కోతి కటింగ్ చేయించుకుంటూ మెరిసింది. మనుషులు స్టైలిష్ గా ముస్తాబవ్వడం చూసిందో ఏమో కానీ.. ఓ కోతి ఏకంగా సెలూన్ షాప్ నకు వెళ్లి కుర్చీలో కూర్చుంది.

ఇక కోతి రాగానే ఎలాంటి భయం లేకుండా... దానికి కటింగ్ కటింగ్ చేశాడు బార్బర్ దేవరాజు. అచ్చం మనుషులను ట్రీట్ చేసినట్లుగానే.. కోతిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నీట్ గా కటింగ్ చేశాడు. బార్బర్ దేవరాజు కటింగ్ చేసినంత సేపు, కుర్చీలో కూర్చున్న కోతి.. ఎలాంటి గొడవ చేయకుండా నిశ్శబ్దంగా కూర్చుంది. దీంతో ఈ స్టైలిష్ మంకీ వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ ఫిదా అయిపోతున్నారు. కోతి నుంచి మనిషి వచ్చింది నిజమే అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

Next Story