- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రేట్.. ఈ కాకిని చూసి చాలా నేర్చుకోవచ్చు.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!?
ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుభ్రత చాలా ముఖ్యమైన అంశం.

దిశ,వెబ్‌డెస్క్: ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుభ్రత చాలా ముఖ్యమైన అంశం. ప్రతి ఒక్కరూ ఇళ్లతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి చుట్టుపక్కల, సమాజంలో, సహజ వాతావరణంలో పరిశుభ్రతను కాపాడుకోవడం అందరి బాధ్యతగా భావించాలి. ఇది ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుతోంది. పరిసరాల పరిశుభ్రతను పాటించడం వలన వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ అభియాన్‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
అంతేకాదు ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి. కానీ, కొన్ని చోట్ల ఇష్టమొచ్చినట్లు చెత్తచెదారం పాడేస్తున్నారు. పరిశుభ్రతను పాటించడం లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పరిశుభ్రతకు మరో అర్ధం చెబుతోంది ఓ కాకి. ఇంతకి ఆ వీడియోలో ఏం ఉందో తెలుసుకుందాం.
వీడియో ప్రకారం.. కాకి పర్యావరణం పట్ల చాలా అవగాహన చూపుతున్నట్లు కనిపిస్తుంది. ఓ కాకి ప్లాస్టిక్ సీసాలు, శీతల పానీయాల డబ్బాలు, కాగితపు ముక్కలు మరియు చుట్టూ పడి ఉన్న ఇతర చెత్తను అక్కడే ఉన్న చెత్త బుట్టలో వేస్తోంది. అయితే, ఆ కాకి తనకు ఇబ్బందిగా భావించకుండా ఖాళీ డబ్బాలను, ఇతర చెత్తను తన ముక్కుతో తీసుకొని సమీపంలోని చెత్తబుట్టలో వేయడం అందరినీ ఆలోచింపజేస్తుంది.
కాకి తన చిన్న ప్రయత్నంతో ఆ ప్రదేశాన్ని పూర్తిగా శుభ్రం చేసేసింది. ఒక కాకి పరిశుభ్రత యొక్క అర్థాన్ని ఎంత బాగా అర్ధం చేసుకుందో ఈ వీడియో ద్వారా గమనించవచ్చు. ఈ వీడియో వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను వేలాది మంది షేర్ చేశారు. దీని పై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ‘‘కాకులు పౌర జ్ఞానాన్ని కలిగి ఉంటాయి’’ అని, మరొకరు 'కాకులను తక్కువ అంచనా వేయకండి.. అవి నిజానికి చాలా మంది మానవుల కంటే తెలివైనవి', ‘ఈ కాకి చాలా గ్రేట్.. దీని నుంచి చాలా నేర్చుకోవాలి’ అని కామెంట్లు పెడుతున్నారు.






