- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GOOGLE : 200 మేకలను నియమించుకున్న గూగుల్
గూగుల్(Google) లో నియామకాలు అంటే అంత ఆషామాషీ కాదు.

దిశ, వెబ్ డెస్క్ : గూగుల్(Google) లో నియామకాలు అంటే అంత ఆషామాషీ కాదు. కాని ఒకసారి ననియామకం అయ్యాక జీవితం సెటిల్ అంటారు టెకీలు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఫ్రెషర్స్ గూగుల్ లో ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురు చూస్తే.. గూగుల్ మాత్రం మేకలను(Goats) నియమించుకొని ఔరా అనిపించింది. అవును మీరు వింటున్నది నిజమే ప్రఖ్యాత టెకీ సంస్థ గూగుల్.. తమ కాలిఫోర్నియాలోని మౌంటైన్ వ్యూ హెడ్‌క్వార్టర్స్(గూగుల్‌ప్లెక్స్) కోసం 200 మేకలను నియమించుకుంది. అయితే ఇదేదో సాఫ్ట్వేర్ జాబ్ కోసం మాత్రం కాదండోయ్. క్యాంపస్ ఆవరణలో పెరిగిన గడ్డి, కలుపు మొక్కలను తిని గ్రౌండ్ ను శుభ్రం చేయడానికట. ప్రతి వసంతకాలంలో కాలిఫోర్నియా గ్రేజింగ్ సంస్థ నుంచి ఒక బోర్డర్ కోలీ కుక్కతో కలిసి ఈ మేకలు ఒక వారం పాటు క్యాంపస్‌లో గడ్డి, కలుపు మొక్కలను తిని శుభ్రపరుస్తూ.. వాటి వ్యర్థాలతో భూమిని సహజ ఎరువుతో సుసంపన్నం చేస్తాయని గూగుల్ ఈ పని చేస్తోంది.
ఇది లాన్ మోవర్ మెషీన్స్ లతో పోలిస్తే గ్యాసోలిన్ వాడకం, శబ్ద కాలుష్యం, కార్బన్ ఉద్గారాలను విడుదల భారీగా తగ్గిస్తుందని పేర్కొంది. కాగా ఇది ఇప్పుడు మొదలైన సాంప్రదాయం కాదని, 2009 నుంచే గూగుల్ ఈ పని చేస్తోందని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. గూగుల్ మాత్రమే కాకుండా గతంలో గెట్టి మ్యూజియం, లాస్ ఏంజిల్స్, శాన్ డియాగోలోని స్క్రిప్స్ రాంచ్ వంటి ప్రాంత అధికారులు కూడా గడ్డిని తొలగించడం ద్వారా అడవి మంటలను నివారించడం కోసం మేకలను ఉపయోగించాయి.






