నాకన్నా పెద్ద గుండా ఎవరూ లేరు.. నా హిస్టరీ షీట్ చూశావా.. నేరాల చిట్టా విప్పుకున్న ఎంపీ

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-09 13:08:45  IST  )

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహాత్‌లో DISHA (డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ హ్యూమన్ అసిస్టెన్స్) సమావేశం జరిగింది. అభివృద్ధి పనులపై సమీక్ష జరుగుతున్న నేపథ్యంలో.. BJP ఎంపీ

నాకన్నా పెద్ద గుండా ఎవరూ లేరు.. నా హిస్టరీ షీట్ చూశావా.. నేరాల చిట్టా విప్పుకున్న ఎంపీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహాత్‌లో DISHA (డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ హ్యూమన్ అసిస్టెన్స్) సమావేశం జరిగింది. అభివృద్ధి పనులపై సమీక్ష జరుగుతున్న నేపథ్యంలో.. BJP ఎంపీ దేవేంద్ర సింగ్ భోలే, మాజీ ఎంపీ అనిల్ శుక్లా వర్సీ (మంత్రి ప్రతిభా శుక్లా భర్త) మధ్య తీవ్రమైన వాగ్వాదం ఏర్పడింది. ఫ్యాక్టరీల పరిశీలన, DISHA సభ్యుల వంటి అంశాలపై మొదలైన మాటల దాడి కాస్త వ్యక్తిగత దాడిగా మారింది. నాకన్నా పెద్ద గుండా ఎవరూ లేరు, నా హిస్టరీ షీట్ చూశావా అంటూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఎమ్మెల్యే, ఎంపీలు, ఎస్పీ.. ఇలా అందరూ ఉండగానే దాడికి దిగగా.. మీటింగ్ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో పోలుస్తూ నవ్వుతున్నారు జనాలు.

Next Story