- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిడ్డను కారులో వదిలేసి.. పోర్న్ వీడియోలు చూసిన తండ్రి.. మృతి
యూఎస్ఏలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆరిజోనా రాష్ట్రం మారానా పట్టణంలో ఓ తండ్రి నిర్లక్ష్యం కారణంగా రెండు ఏళ్ల పాప చనిపోయింది. క్రిస్టోఫర్ రయాన్ షోల్టెస్(38) 2024 జూలైలో మండుతున్న ఎండలో(43°C) కారును పార్క్ చేశాడు. బిడ్డను అందులోనే వదిలేశాడు.

దిశ, వెబ్ డెస్క్ : యూఎస్ఏలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆరిజోనా రాష్ట్రం మారానా పట్టణంలో ఓ తండ్రి నిర్లక్ష్యం కారణంగా రెండు ఏళ్ల పాప చనిపోయింది. క్రిస్టోఫర్ రయాన్ షోల్టెస్(38) 2024 జూలైలో మండుతున్న ఎండలో(43°C) కారును పార్క్ చేశాడు. బిడ్డను అందులోనే వదిలేశాడు. దాదాపు నాలుగు గంటలు అలాగే ఉండటంతో హీట్ స్ట్రోక్‌తో మరణించింది. పాప తల్లి వర్క్ నుంచి ఇంటికొచ్చాక ఆమె ప్రస్తావన రాగా కారులో చూడగా నిర్జీవంగా కనిపించింది. కాగా మిగిలిన ఇద్దరు పిల్లలు కూడా తమ తండ్రి తరుచూ ముగ్గురిని కారులో వదిలేస్తాడని.. గేమ్ ఆడటం లాంటి పనుల్లో నిమగ్నమైపోతాడని చెప్పారు. పైగా తల్లి ముందుగానే పిల్లలను కారులో వదిలిపెట్టదని మెసేజ్ చేసినా కూడా అదే చేయడం షోల్టెస్ ప్రమాదకర ప్రవర్తనకు ఉదాహరణగా కనిపిస్తుంది.
కాగా షోల్టెస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్డాయి. 30ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. నవంబర్ 21, 2025న ఈ శిక్ష విధానం జరగాల్సి ఉంది. కానీ నవంబర్ 5న కోర్టు హియరింగ్ రోజున షోల్టెస్ ఓ ఇంట్లో చనిపోయాడు. దీన్ని సూసైడ్‌గా పరిగణిస్తున్నారు.






