- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ భూమి కబ్జా.. ఖాళీ చేయమన్నందుకు ఈ భార్యాభర్తలు చేసిన పనికి అంతా షాక్!
ఉత్తర్‌ప్రదేశ్‌లో (Uttarpradesh) ఆశ్చర్యకరమైన ఘటన వెలుగుచూసింది.

దిశ, వెబ్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లో (Uttarpradesh) ఆశ్చర్యకరమైన ఘటన వెలుగుచూసింది. డియోరియా జిల్లాలోని పట్లాపూర్ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు గుచ్చి దేవి, రామ్‌నరేష్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో ఆ స్థలాన్ని ఖాళీ చేయటం ఇష్టంలేని ఆ దంపతులు అదే భూమి భూసమాధికి (Husband, Wife Attempt Bhu Samadhi) ప్రయత్నించారు.
ఏప్రిల్ 15న ఆ స్థలం వద్ద లోతుగా గొయ్యి తవ్వి అందులోకి దిగారు. ఆ తర్వాత మెడల వరకు మట్టితో పూడ్చుకున్నారు. కబ్జా చేసిన ప్రభుత్వ భూమి నుంచి తమను మాత్రమే ఖాళీ చేయిస్తున్నారని, వేరే వారిని ఖాళీ చేయించడం లేదని ఆ దంపతులు ఆరోపించారు. ఈ సమాచారం తెలుసుకున్న అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. భూ సమాధికి ప్రయత్నించిన గుచ్చి దేవి, రామ్‌నరేష్‌లకు నచ్చజెప్పి.. వారిని అందులోంచి బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






