లవర్‌తో గడపడానికి లీవ్ అడిగిన ఉద్యోగి.. మేనేజర్ ఏం చేశాడంటే?

by Ajay Maddhiboyina |

ఉద్యోగం చేస్తున్న‌ప్పుడు సెల‌వులు అడ‌గ‌టం సాధార‌ణం. ఆరోగ్యం బాగోలేద‌నో, పెళ్లిళ్లు ఫంక్ష‌న్ల‌కు వెళ్లాలి అనో, టూర్‌కి వెళ్లాలి అనో ఇలా రకరకాల కారణాలో లీవ్స్ అడుగుతుంటారు.

లవర్‌తో గడపడానికి లీవ్ అడిగిన ఉద్యోగి.. మేనేజర్ ఏం చేశాడంటే?
X

దిశ‌, వెబ్ డెస్క్: ఉద్యోగం చేస్తున్న‌ప్పుడు సెల‌వులు అడ‌గ‌టం సాధార‌ణం. ఆరోగ్యం బాగోలేద‌నో, పెళ్లిళ్లు ఫంక్ష‌న్ల‌కు వెళ్లాలి అనో, టూర్‌కి వెళ్లాలి అనో ఇలా రకరకాల కారణాలో లీవ్స్ అడుగుతుంటారు. చెప్పుకోలేని పనులు ఉన్నప్పుడు అబద్దాలు చెప్పి మరీ లీవ్స్ తీసుకుంటారు. కానీ అసలు కారణం చెప్పరు. కానీ ఢిల్లీలోని ఓ కార్పోరేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి అబద్దం చెప్పకుండా తన ప్రేయసితో గడిపేందుకే మేనేజర్‌ను లీవ్ అడిగాడు. తన ప్రేయసి ఉత్తరాఖండ్ వెళుతుందని ఆమెతో ఒకరోజు గడిపేందకు సెలవు కావాలని మెయిల్ చేశాడు. దీంతో మేనేజర్ ఆశ్చర్యానికి గురయ్యాడు.

ఎవరైనా అనారోగ్యం, ఇతర కారణాలు చెప్పి లీవ్ అడుగుతారు అలా అడిగితే కచ్చితంగా లీవ్ వస్తుందని తెలిసే చేస్తారు. కానీ ఈ యువకుడు ఏంటి ప్రేయసితో గడిపేందుకు లీవ్ అడుగుతున్నాడు అని ఆశ్చర్యపోయాడు. అయితే అతడి నిజాయితీకి మాత్రం ఫిదా అయ్యాడు. ఎంతోమంది అబద్దాలు చెప్పి లీవ్స్ తీసుకుంటారని కానీ ఇతడు నిజం చెప్పి లీవ్ అడిగాడని కాబట్టి ఇచ్చేయని తీసుకో తమ్ముడూ అంటూ సమాధానం ఇచ్చాడు. ఆ మేనేజర్ ఉద్యోగి చేసిన మెయిల్ ను లింక్డ్ ఇన్ లో షేర్ చేశాడు. అది కాస్తా వైరల్ అవ్వడంతో ఉద్యోగిపై, మేనేజర్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story