స్కూల్‌ బస్సులో అకస్మాత్తుగా మంటలు.. ప్రాణాలకు తెగించి 20 మంది పిల్లలను కాపాడిన లేడీ డ్రైవర్

by Sujitha Rachapalli |

ఎలిమెంటరీ స్కూల్ బస్సు.. లోపల 20 మంది విద్యార్థులు.. అకస్మాత్తుగా ఎగిసిపడిన మంటలు.. భయాందోళనలో పిల్లలు.. అరుపులు వినిపిస్తున్నాయి.. కానీ లేడీ బస్సు డ్రైవర్ మాత్రం అస్సలు భయపడలేదు.. ముందుగా పిల్లలను సేఫ్‌గా బయటకు చేర్చడమే లక్ష్యంగా పని చేసింది..

స్కూల్‌ బస్సులో అకస్మాత్తుగా మంటలు.. ప్రాణాలకు తెగించి 20 మంది పిల్లలను కాపాడిన లేడీ డ్రైవర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఎలిమెంటరీ స్కూల్ బస్సు.. లోపల 20 మంది విద్యార్థులు.. అకస్మాత్తుగా ఎగిసిపడిన మంటలు.. భయాందోళనలో పిల్లలు.. అరుపులు వినిపిస్తున్నాయి.. కానీ లేడీ బస్సు డ్రైవర్ మాత్రం అస్సలు భయపడలేదు.. ముందుగా పిల్లలను సేఫ్‌గా బయటకు చేర్చడమే లక్ష్యంగా పని చేసింది.. ఒక్కొక్కరిని బయటకు తీసుకెళ్లి దిగబెట్టింది.. మంటలు పూర్తిగా వ్యాపించాయి.. అక్కడకు చేరుకున్న జనాలు లోపలికి వెళ్లొద్దని.. వెళ్తే ప్రమాదమని అరుస్తున్నారు.

కానీ ఆమె వినిపించుకోలేదు.. ఏ ఒక్క చిన్నారి కూడా ఈ ప్రమాదానికి బలి కాకూడదని లోపలకు వెళ్లింది.. ప్రతీ సీటు.. ప్రతీ కార్నర్ చూసింది.. బస్సు నుంచి పిల్లలంతా దిగారని నిర్ధారించుకుంది. ఆమె కూడా దిగేందుకు ప్రయత్నించేలోపే మంటలు ఆమెను చుట్టుముట్టాయి. డ్రెస్సుకు అంటుకోవడంతో.. జనాల కళ్ల ముందే ఆమె పూర్తిగా కాలిపోయింది. అయినా సరే ఆమె కళ్లలో ఏ భయం లేదు. ఈ స్టోరీ యునైటెడ్ స్టేట్స్ అమెరికాలోని మేరీలాండ్స్‌లో జరిగిన ఘటనకు సంబంధించినది కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story