Viral News : కోతి పనికి దేశం అంతా కరెంట్ కట్

by Muthe.Rajitha |

కోతి(Monkey) పనులు, కోతి చేష్టలు అని తేలిగ్గా తీసివేస్తాం మనం.

Viral News : కోతి పనికి దేశం అంతా కరెంట్ కట్
X

దిశ, వెబ్ డెస్క్ : కోతి(Monkey) పనులు, కోతి చేష్టలు అని తేలిగ్గా తీసివేస్తాం మనం. కాని ఆ దేశంలో కోతి చేసిన ఓ చిన్న పనికి దేశం మొత్తం గంటల కొద్దీ అంధకారంPower Cut)లో గడపాల్సి వచ్చింది. ఇంతకీ ఆ కోతి ఏం చేసిందంటే.. ఆదివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో శ్రీలంక(Srilanka)లో దక్షిణ కొలంబో(South Colonbo)లోని పాణదుర ప్రాంతంలోని విద్యుత్ గ్రిడ్(Power Grid) సబ్ స్టేషన్లో ముఖ్యమైన వ్యవస్థలను లాగిపారేయడంతో ఒక్కసారిగా విద్యుత్ వ్యవస్థ ఆగిపోయింది(Power Outage). దీంతో దేశం మొత్తం కొన్ని గంటలపాటు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. అసలేం జరిగిందో తెలియడానికే గంట సమయం పట్టినట్టు అధికారులు పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో 2.2 కోట్లమంది ప్రజలతో పాటు వైద్య సేవలు, నీటి శుద్ధి సరఫరా వ్యవస్థలు ఆగిపోయాయి. తిరిగి అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేయడానికి 5 గంటలకు పైగా సమయం పట్టింది.

ఈ వ్యవహారంపై కేంద్ర విద్యుత్ శాఖమంత్రి కుమార జయకోడి(Kumara Jayakodi) స్పందిస్తూ.. "గ్రిడ్ ట్రాన్స్‌ఫార్మర్‌లోకి ఓ కోతి రావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది" అని ప్రకటించడంతో.. ఈ వార్త కాస్త దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. అయితే ఈ వ్యవహారాన్ని అధికారులు తేలిగ్గా తీసుకోవడంపై ప్రజలు సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఒక పనికిమాలిన కోతి కొలంబోలోని సబ్‌స్టేషన్‌లో చేసిన పనికి శ్రీలంక పవర్ గ్రిడ్ కుప్పకూలి దేశమంతా కరెంట్ ఆగిపోయింది" అని మరియో నాఫల్ అనే వ్యక్తి 'ఎక్స్' లో పోస్ట్ చేశారు. "ఓ విద్యుత్ కేంద్రంలో కోతులు గొడవ పడితే దేశమంతా కరెంట్ పోవడం శ్రీలంకలో మాత్రమే ఉంటుందేమో" అని స్థానిక పత్రిక డైలీ మిర్రర్ ఎడిటర్ ఇన్ చీఫ్ జమిలా హుసేన్ రాశారు.

విద్యుత్ సరఫరా లైన్లలో ఏ ఒక్క చోట చిన్న అంతరాయం ఏర్పడినా దేశమంతటా కరెంట్ పోయేంత పరిస్థితిలో జాతీయ పవర్ గ్రిడ్ ఉందని.. పవర్ గ్రిడ్‌ను ఆధునీకరించాలని, లేకపోతే తరచుగా విద్యుత్ అంతరాయాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాలను కొన్నేళ్లుగా హెచ్చరిస్తున్నామని సీనియర్ ఇంజనీర్ ఒకరు చెప్పారు. కాగా 2022లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం(Financial crisis) తర్వాత శ్రీలంక తరచుగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాల్ని ఎదుర్కొంటోంది.

Next Story