నూడుల్స్‌ తింటున్నారా? ఈ హెచ్చరికను తప్పక చదవండి!

by Yella Dhawani Reddy |

మనలో చాలా మంది నూడిల్స్ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు, అది స్నాక్‌గానైనా, చిన్న భోజనంగా అయినా ఎంతో ఇష్టంగా తింటుంటారు.

నూడుల్స్‌ తింటున్నారా? ఈ హెచ్చరికను తప్పక చదవండి!
X

దిశ, వెబ్ డెస్క్: మనలో చాలా మంది నూడిల్స్ (Noodles) అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు, అది స్నాక్‌గానైనా, చిన్న భోజనంగా అయినా ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇందులోనూ ఇన్‌స్టంట్ నూడుల్స్ అంటే ప్రత్యేక క్రేజ్. వేగంగా తయారవుతాయ్, తక్కువ ఖర్చుతో టేస్టీగా ఉండటంతో చాలామంది తరచుగా ఇవే తినడం అలవాటుగా మార్చుకున్నారు. అలాంటి వారందరూ ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్ (Viral) అవుతోన్న వీడియోను తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఆ వీడియోలో చూపించిన విషయాలు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తాయి.

ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేసిన వీడియోలో రామెన్ నూడుల్స్ (Ramen noodles) ప్యాకెట్ వెనక భాగంలో 'Cancer and Reproductive Harm' అనే హెచ్చరిక కనిపిస్తోంది. చిన్న అక్షరాల్లో ముద్రించిన ఈ సమాచారం చాలా మందికి తెలియదనే ఉద్దేశంతో, ఆ వ్యక్తి ప్యాకెట్లను తిరగేస్తూ ఈ నిజాన్ని అందరికీ చూపించాడు. ఈ వీడియో త్వరగా వైరల్ కావడంతో లక్షలాదిమంది దీనిపై స్పందిస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు షాక్ అవుతున్నారు. 'ఇంత పెద్ద ప్రమాదం ఇంత చిన్న అక్షరాల్లో ఎలా రాస్తారు?' అని కొందరు ప్రశ్నించగా, మరికొందరు 'ఇలాంటివి తినడం ప్రమాదకరమే అని చాలా కాలంగా తెలుసు' అంటూ, 'ఏదైనా ఎక్కువగా తింటే హానికరమే. ఏడాదికి రెండు, మూడుసార్లు తినడంలో పెద్ద సమస్య ఉండదు' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఈ ఘటన ప్రాసెస్డ్ ఫుడ్స్, ముఖ్యంగా తక్షణ నూడుల్స్ వంటి వాటిపై ప్రజల్లో కొత్త చర్చకు దారితీసింది. ప్రాసెస్డ్, స్పైసీ ఫుడ్‌ల అధిక వినియోగం ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు కూడా పదే పదే హెచ్చరిస్తున్నారు. దీన్ని బట్టి ఏ తినుబండారమైనా కొనుగోలు చేసే ముందు దాని ప్యాకింగ్‌పై ఉన్న సమాచారం, లేబుల్స్‌ను శ్రద్ధగా చదవడం అవసరం అని నిపుణులు చెబుతున్నారు. సామాన్యంగా ఉపయోగించే ఉత్పత్తులపై ఇలాంటి కీలక హెచ్చరికలు చిన్న అక్షరాల్లో ముద్రించడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Next Story